వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది పక్కా: ట్రంప్ మైండ్ గేమే.. హెచ్1 బీ వీసా చట్టంలో మార్పులకు నో ‘ఛాన్స్’

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హెచ్1బీ వీసాదారులకు పొడిగింపును రెండుసార్లకే పరిమితం చేసేందుకు అవసరమైన చట్ట సవరణకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్) అధికారులు సిద్ధమౌతున్నారు. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డ్ వచ్చే లోగా తమకున్న హెచ్1బీ వీసాలను ఎన్నిసార్లయినా పొడిగించుకోవడానికి విదేశీ ఉద్యోగులకు వెసులుబాటు ఉంది. ఎక్కువ నైపుణ్యం ఉన్న ఇతర దేశాల సిబ్బందిని హెచ్1బీ వీసా ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన అమెరికా రప్పించడానికి 2000లో అమెరికా కాంగ్రెస్ (ఉభయసభలు- సెనెట్, ప్రతినిధుల సభ) అమెరికా కాంపిటీటివ్నెస్ ఇన్ ట్వెంటీఫస్ట్ సెంచరీ చట్టం చేసింది. 17 ఏండ్లుగా ఈ చట్టం అమల్లో ఉంది.

గ్రీన్ కార్డ్ కోసం విదేశీ ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా హెచ్1బీ వీసాలను 'ఎన్నిసార్లయినా పొడిగించే ' అవకాశం ప్రస్తుత చట్టంలో ఉంది. 'పొడిగించే అవకాశం ఉంది' అనే పదాలకు కొత్త భాష్యం చెప్పడానికి ఎంత వరకు వీలు ఉన్నది? అనే అంశాన్ని డీహెచ్ఎస్ శాఖాధిపతులు క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతి మూడేళ్లకు హెచ్1బీ వీసాల పొడిగింపును 'ఎన్నిసార్లయినా'కు బదులుగా రెండుసార్లకే పరిమితం చేసి లక్షల మంది ఈ వీసాదారులు తమంట తామే అమెరికా విడిచి పోయేలా చేయాలన్నది అంతర్గతంగా ఈ విభాగంలో చర్చ జరుగుతోంది.

 పది లక్షల మంది విదేశీయుల్లో ఇండియన్లే ఎక్కువ

పది లక్షల మంది విదేశీయుల్లో ఇండియన్లే ఎక్కువ

ఈ మార్పులు ఎలా చేస్తారో వెల్లడించడానికి డీహెచ్ఎస్ కింద పనిచేసే అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం సిబ్బంది సిద్ధపడడం లేదు. అమెరికా కాంపిటీటివ్నెస్ ఇన్ ట్వంటీఫస్ట్ సెంచరీ చట్టంలో సవరణ లేదా రెండు మాటలకు వేరే అర్థం చెప్పడం ద్వారా లక్ష్యం సాధించలేమని అమెరికా కార్మికుల తరఫున పోరాడుతున్న లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ‘తక్కువ నైపుణ్యం ఉన్న హెచ్1బీ వీసాదారుల కారణంగా స్థానిక అమెరికన్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. చట్టంలోని రెండు పదాలు తొలగించినా ఆశించిన ఫలితం సాధించలేరు. ఈ చట్టాన్ని రద్దుచేయడం ఒక్కటే మార్గం' అని అమెరికా కార్మికుల తరఫున వాదించే లాయర్ జాన్ మియానో చెప్పారు. కాంగ్రెస్ ఆమోదముద్ర లేకుండా హెచ్-1బీ వీసా ప్రోగ్రాంలో మార్పులు తలపెడితే భారీ సంఖ్యలో కోర్టుకెక్కుతారని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం పది లక్షల మంది వరకూ హెచ్1బీ వీసాదారులుండగా, వారిలో అత్యధికులు భారతీయులే.

Recommended Video

Donald Trump in Korea : కొరియాలో ట్రంప్ టూర్, టెన్షన్...టెన్షన్
 చట్టంలో మార్పు చేసినా.. కోర్టులు కొట్టేస్తాయి

చట్టంలో మార్పు చేసినా.. కోర్టులు కొట్టేస్తాయి

అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టంలో మార్పులను అధ్యక్షుడు తన కార్యనిర్వాహక చర్య ద్వారాగానీ, ఉత్తర్వు ద్వారా గానీ సాధించలేరని అమెరికా చట్టాలను అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. ‘హెచ్1బీ వీసాల గడువు పొడిగింపును ‘మంజూరు చేయవచ్చు' అని పైన చెప్పిన చట్టంలోని 104(సీ) సెక్షన్లోని పదాలకు కార్యనిర్వాహక వ్యవస్థ కొత్త భాష్యం చెప్పడం ద్వారా వీసా ప్రోగ్రాంలో మార్పుతేవడం కుదిరేపని కాదు. ఒకవేళ అలా చేస్తే అమెరికా కోర్టులు ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తాయి. అంతిమంగా ప్రభుత్వానికి ఓటమి తప్పదు' అని చుఘ్ ఎలెల్పీ అనే న్యాయవాద సంస్థ అధిపతి నవనీత్ ఎస్ చుఘ్ చెప్పారు. మరో పక్క అమెరికా వ్యాపారవర్గాలకు ప్రాతినిధ్యం వహించే అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఏసీసీ) కూడా ట్రంప్ సర్కార్ తీసుకోనున్న చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని తేల్చిచెప్పింది. ‘సొంతిల్లు, అమెరికా పౌరసత్వం గల పిల్లలతో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వృత్తినిపుణులను వెనక్కి పంపడం సబబుకాదు. ఈ విధానం అమెరికా వ్యాపారాలు, ఆర్థికవ్యవస్థకు హాని చేస్తుంది' అని ఏసీసీ ప్రతినిధి హెచ్చరించారు.

 ఏడాది పొడిగింపు ఆప్షన్‌తోనే అంతా సాధించొచ్చు ఇలా

ఏడాది పొడిగింపు ఆప్షన్‌తోనే అంతా సాధించొచ్చు ఇలా

ట్వింటీఫస్ట్ సెంచరీ చట్టంలో 104 (సీ) సెక్షన్ ప్రకారం హెచ్ - 1 బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకునే వారిని మాత్రమే మూడేళ్లపాటు, 106 (సీ) సెక్షన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి ఏడాది గడువు ఉంటుంది. దీనర్ధం 365 రోజులకు పైగా శాశ్వత సభ్యత్వం కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే హెచ్ 1 బీ వీసా పొడిగింపు జరుగుతుంది. ఒకసారి పొడిగింపును అనుమతినిస్తే తదుపరి యధాతథంగానే పొడిగింపు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలంటే కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. ఈ క్రమంలో సంస్థల యాజమాన్యాలు, వీసా హోల్డర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ అమెరికా వీసా పాలసీలో మార్పు తీసుకొచ్చే అవకాశాలు ఉంటే ఏడాది పొడిగింపు కోరేందుకు సంస్థలు, వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ హెచ్ 1 బీ వీసాకు గానీ, ఎల్ - 1 వీసాలో గానీ ఏవైనా మార్పులు చేయాలంటే ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ కేవలం మొదటి మూడేళ్లు, తర్వాత ఒకసారి మాత్రమే పొడిగింపునకు అవకాశం కల్పిస్తూ అమెరికా కాంగ్రెస్.. చట్టానికి సవరణ తీసుకొస్తే దీనికి ప్రత్యామ్నాయంగా.. శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కోసం చేసిన దరఖాస్తు ఆధారంగా వరుసగా ఏడాది పొడిగించుకునే అవకాశం హెచ్ 1 బీ వీసాదారులకు ఎలాగూ ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.

English summary
Pursuant to the American Competitiveness in the 21st Century Act (AC-21), one is eligible, pursuant to Section 104(c) to a three-year H-1B extension beyond the normal six-year maximum period if the applicant has an approved employment-based immigrant visa petition, and is eligible to be granted lawful permanent resident status, but is prevented from doing so because of a lack of visa availability.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X