వారధి: మహా గవర్నర్‌చే 'కోట'కు ఘన సన్మానం
హైదరాబాద్: శనివారం శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమనంలో మహారాష్ట్ర, తెలంగాణ మంచ్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారధి పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ-మహారాష్ట్ర ప్రజల మధ్య సత్సబంధాలు, అభివృద్ధికి వారధిలా కృషి చేస్తానని అన్నారు.

కోటాకు ఘన సన్మానం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృష్టి చేస్తానని చెప్పారు.

కోటాకు ఘన సన్మానం
2020 నాటికి ప్రపంచ దేశాలు భారతదేశ యువతవైపు చూస్తాయని యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు.

కోటాకు ఘన సన్మానం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ 800పై చిలుకు చిత్రాల్లో నటించిన కోటా శ్రీనివాసరావును ఈ సందర్భంగా సత్కరించుకోవడం చాలా అనందంగా ఉందన్నారు. అనంతరం తెలుగువేదిక ఈ మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు.

కోటాకు ఘన సన్మానం
ఈ కార్యక్రమంలో వేణగోపాల చారి, మహారాష్ట్ర ఎమ్మెల్యే ఆశీష్ శిలార్, ఏవీ గుప్తా, దైవజ్ఞ శర్మలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications