వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనవరి 31న అంతరిక్షంలో అద్భుతం.. 2018లో వచ్చే సూర్య, చంద్రగ్రహణాలివే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ నెల 31న విశ్వంలో అద్భుతం జరగనుంది. చరిత్రలోనే అత్యంత అరుదైన బ్లూమూన్‌ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రజలకు కనువిందు చేయనుంది. సాధారణంగా నెలలో రెండోసారి కనిపించే నిండు చంద్రుడు సంపూర్ణ గ్రహణానికి గురవడాన్ని బ్లూమూన్‌ అని పిలుస్తారు. ఇటువంటి అపూర్వ ఘటన 150 ఏళ్ల కిందట ఒకసారి ఆవిష్కృతమైంది. మళ్లీ ఇన్నేళ్లకు 2018 జనవరి 31న అంతరిక్షంలో బ్లూమూన్‌ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

జనవరి 31న గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించనున్నాడు. అందుకే దీన్ని సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. మళ్లీ ఇలాంటి గ్రహణం 2037లో సరిగ్గా జనవరి 31నే ఏర్పడనుండటం విశేషం. జనవరి 31న ఏర్పడే ఈ అరుదైన చంద్రగ్రహణం.. మొత్తం 77 నిమిషాలపాటు కనువిందు చేయనుంది. ఈ సమయంలో చంద్రుడిపై పడే భూమి దక్షిణ భాగపు నీడను స్పష్టంగా వీక్షించవచ్చు.

ఈ అంతరిక్ష వింతను మధ్య ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఐరోపా, అలాస్కా, కెనడా, సెంట్రల్‌ అమెరికా ప్రాంత ప్రజలు వీక్షించవచ్చు. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు పసిఫిక్‌ మహాసముద్రం మీద ప్రయాణిస్తుంటాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఏడాది మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో మూడు పాక్షిక సూర్యగ్రహణాలు కాగా మిగతా రెండు చంద్ర గ్రహణాలు.

ఫిబ్రవరి 15, జూలై 13, ఆగష్టు 11 తేదీల్లో ఏర్పడే సూర్య గ్రహణాలను మన దేశం నుంచి వీక్షించలేం. కానీ జనవరి 31 ఏర్పడనున్న అత్యంత అరుదైన చంద్ర గ్రహణాన్ని మాత్రం కోట్లాది మంది భారతీయుల వీక్షించే వీలుంది. జనవరి 31న సాయంత్రం 6.27 నుంచి 6.31 మధ్య ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చని పుణేలోని నెహ్రూ ప్లానెటోరియం డైరెక్టర్ అరవింద్ తెలిపారు.

 జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం...

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం...

జనవరి 31 ఏర్పడనున్న, బ్లడ్ మూన్‌గా పిలిచే అత్యంత అరుదైన చంద్ర గ్రహణాన్ని అమెరికా, ఐరోపా, రష్యా, ఆసియా, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అస్ట్రేలియా నుంచి పూర్తిగా చూడొచ్చు. ఇంకా.. ఉత్తర/తూర్పు యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర/తూర్పు ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఉత్తర/పశ్చిమ దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల నుంచి, ఆర్కిటిక్, అంటార్కిటికా తదితర ప్రదేశాల నుంచి వీక్షించవచ్చు. అంటే గ్రహణం ప్రారంభం నుంచి సమాప్తం అయ్యేంత వరకు చూడొచ్చన్నమాట. మన దేశంలో ప్రత్యేకంగా కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ నుంచి ఈ బ్లడ్ మూన్‌ను తిలకించవచ్చు. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల ప్రజలు కూడా చూడొచ్చు.

ఈవెంట్ తేదీ సమయం కనిపిస్తుందా? లేదా?

చంద్రుడిపై భూమి నీడ ప్రారంభం 31 జనవరి 16:21:13 కనబడదు
పాక్షిక గ్రహణం ప్రారంభం 31 జనవరి 17:18:27 కనబడదు
పూర్తి గ్రహణం ప్రారంభం 31 జనవరి 18:21:47 కనిపిస్తుంది
గరిష్ట గ్రహణం 31 జనవరి 18:59:51 కనిపిస్తుంది
గ్రహణం పూర్తి 31 జనవరి 19:37:51 కనిపిస్తుంది
పాక్షిక గ్రహణం పూర్తి 31 జనవరి 20:41:11 కనిపిస్తుంది
చంద్రుడిపై భూమి నీడ పూర్తి 31 జనవరి 21:38:29 కనిపిస్తుంది

 ఫిబ్రరి 15న పాక్షిక సూర్యగ్రహణం...

ఫిబ్రరి 15న పాక్షిక సూర్యగ్రహణం...

ఫిబ్రరి 15న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతం, పసిఫిక్, అట్లాంటిక్, అంటార్కిటికాలో కనిపిస్తుంది. ఒకవేళ ప్రత్యక్షంగా వెబ్‌క్యామ్ ద్వారా చూడాలనుకుంటే కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు.

ఈవెంట్ తేదీ సమయం

తొలి ప్రదేశంలో పాక్షిక గ్రహణం ప్రారంభం 16 ఫిబ్రవరి 00:25:51
గరిష్ట గ్రహణం 16 ఫిబ్రవరి 02:21:29
చివరి ప్రదేశంలో పాక్షిక గ్రహణం పూర్తి 16 ఫిబ్రవరి 04:17:08

 జూలై 13న పాక్షిక సూర్యగ్రహణం...

జూలై 13న పాక్షిక సూర్యగ్రహణం...

ఈ ఏడాది జూలై 13న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ ఆస్ట్రేలియా, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల వారికి కనిపిస్తుంది.

ఈవెంట్ తేదీ సమయం

తొలి ప్రదేశంలో పాక్షిక గ్రహణం ప్రారంభం 13 జూలై 07:18:23
గరిష్ట గ్రహణం 13 జూలై 08:31:05
చివరి ప్రదేశంలో పాక్షిక గ్రహణం పూర్తి 13 జూలై 09:43:44

 జూలై 27 లేదా 28న సంపూర్ణ చంద్రగ్రహణం...

జూలై 27 లేదా 28న సంపూర్ణ చంద్రగ్రహణం...

యూరప్, ఆసియా ఖండాల్లోని అధిక ప్రాంతాల ప్రజలు జూలై 27 లేదా 28న ఏర్పడే ఈ సంపూర్ణ చంద్రగ్రహణంను చూడవచ్చు. అలాగే ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలోని దక్షిణ భూభాగం, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. మన దేశంలో ప్రత్యేకంగా కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ నుంచి ఈ చంద్రగ్రహణాన్ని తిలకించవచ్చు. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల ప్రజలు కూడా చూడొచ్చు.

ఈవెంట్ తేదీ సమయం కనిపిస్తుందా?లేదా?

చంద్రుడిపై భూమి నీడ ప్రారంభం 27 జూలై 22:44:47 కనిపిస్తుంది
పాక్షిక గ్రహణం ప్రారంభం 27 జూలై 23:54:27 కనిపిస్తుంది
పూర్తి గ్రహణం ప్రారంభం 28 జూలై 01:00:15 కనిపిస్తుంది
గరిష్ట గ్రహణం 28 జూలై 01:51:44 కనిపిస్తుంది
గ్రహణం పూర్తి 28 జూలై 02:43:11 కనిపిస్తుంది
పాక్షిక గ్రహణం పూర్తి 28 జూలై 03:49:00 కనిపిస్తుంది
చంద్రుడిపై భూమి నీడ పూర్తి 28 జూలై 04:58:38 కనిపిస్తుంది.

 ఆగస్టు 11న పాక్షిక సూర్యగ్రహణం...

ఆగస్టు 11న పాక్షిక సూర్యగ్రహణం...

ఈ ఏడాది ఆగస్టులో కూడా మరో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది ఆగస్టు 11న ఏర్పడుతుంది. ఉత్తర/తూర్పు యూరోప్, ఉత్తర/పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికాలోని ఉత్తర భాగం, అట్లాంటిక్, అర్కిటిక్ ప్రాంతాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది.

ఈవెంట్ తేదీ సమయం

తొలి ప్రదేశంలో పాక్షిక గ్రహణం ప్రారంభం 11 ఆగస్టు 13:32:08
గరిష్ట గ్రహణం 11 ఆగస్టు 15:16:24
చివరి ప్రదేశంలో పాక్షిక గ్రహణం పూర్తి 11 ఆగస్టు 17:00:40

English summary
The first lunar eclipse of this year is quite a rare occurrence. On January 31, we will witness the first eclipse involving a Blue Moon in more than 150 years. Such a phenomenon was last seen on March 31, 1866, and will not be seen again for 11 more years, till December 31, 2028. As the moon will be red in colour (termed 'Blood Moon') at the height of the total eclipse, and given that this will be a Blue Moon, this eclipse is being called the 'Super Blue-Blood Moon'.Know all about Solar and Lunar Eclipse in 2018. Know the dates and time of Surya and Chandra Grahan in year 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X