స్టన్నింగ్ మేకప్: మీ కళ్లను మీరే నమ్మలేరు.. ఎవరీ మిమి ఛోయ్?, మీరెప్పుడూ చూడని ఇల్యూషన్స్

కెనడా: ఆమె బ్రష్ చేత పట్టి తన ఒంటి మీదే ప్రయోగాలు చేసుకుంటుంది. ప్రతీ ప్రయోగమూ ఒక గొప్ప కళాఖండంలా కనిపించేలా మెస్మరైజ్ చేస్తుంది. ఎంతలా అంటే.. మనం చూస్తున్నది ఫోటోషాప్ ద్వారా ఎడిట్ చేసిన చిత్రమా? లేక నిజమైన మనిషినా? అన్నది కూడా నమ్మలేనంతగా..

కెనడాకు చెందిన మిమిఛోయ్(31) అనే మేకప్ ఆర్టిస్ట్ తన ప్రతిభతో ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది. గ్రాఫిక్స్ తో చేయగలిగే మాయను ఆమె కేవలం తన చేత్తో చేయగలుగుతుండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా కోసినట్లు, ముఖంలోని ఒక భాగాన్ని వేరుచేసినట్లు.. ఇలా వందలకొద్ది మేకప్ ట్రిక్స్ ఆమె అసమాన ప్రతిభను చాటిచెబుతున్నాయి.

 ఎవరీ మిమిఛోయ్:

ఎవరీ మిమిఛోయ్:

కెనడాలోని వాంకోవర్ నగరానికి చెందిన మిమిఛోయ్ గతంలో స్కూల్ టీచర్‌గా పనిచేశారు. స్కూల్ టీచర్ ఉద్యోగం బాగున్నప్పటికీ ఏదైనా వినూత్నంగా చేయాలన్న తాపత్రయంతోనే ఈ రంగంలోకి వచ్చానని ఆమె చెబుతారు. 'నా ముఖం ఒక బ్లాంక్ కాన్వాస్.. దానిపైనే నేను ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తాను' అంటారు మిమిఛోయ్. మూడేళ్ల నుంచి మేకప్ ఆర్టిస్టుగా ఆమె ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

 అవే స్ఫూర్తి:

అవే స్ఫూర్తి:

'ఇల్యూషన్స్ చేస్తున్నప్పుడు.. నేను నా చుట్టూ ఉండే పరిసరాలు, ఫోటోగ్రఫీ, పెయింటింగ్స్, ఎమోషన్స్ నుంచే స్ఫూర్తి పొందుతాను. ఇతర మేకప్ ఆర్టిస్టుల వర్క్ వైపు అంతగా తొంగిచూడను. నన్ను నేను ఛాలెంజ్ చేసుకుని వర్క్ లోకి దిగుతాను. అంతిమంగా ఒక యునిక్ ఇల్యూషన్ అందించడమే నా ధ్యేయం' అని మిమిఛోయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

తొలిరోజుల్లో అక్కడ శిక్షణ:

తొలిరోజుల్లో అక్కడ శిక్షణ:

తొలిరోజుల్లో బ్లాంచ్ మెక్ డొనాల్డ్ ఆధ్వర్యంలోని ఒక లోకల్ బ్యూటీ స్కూల్లో క్లాసులకు హాజరయ్యారు. అక్కడ ఆమె నేర్చుకున్న విద్య కంటే ఆ తర్వాతి రోజుల్లో ఆమె చేసిన ప్రయోగాలు ఆమెను అసామానంగా నిలిపాయి.

చూసేవాళ్లు తమ కళ్లనే నమ్మలేని రీతిలో ఆమె ఇల్యూషన్స్ ఉండటం విశేషం. తన ఇల్యూషన్స్ అన్నింటిని మిమిఛోయ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేస్తుంటారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెను ఐదు లక్షల మంది ఫాలో అవుతున్నారంటే ఆమె టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 ప్రత్యేక ప్రొడక్ట్స్ ఏమి వాడదు:

ప్రత్యేక ప్రొడక్ట్స్ ఏమి వాడదు:

ఇలాంటి అబ్బురపరిచే ఇల్యూషన్స్ కోసం మిమిఛోయ్ ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ ఏమి వాడట్లేదు. ఆమె లేటెస్ట్ ఇల్యూషన్ సుషి(జపనీస్ డిష్) కోసం క్రయోలాన్ ఆక్వా కలర్స్, సువా బ్యూటీ హైడ్రా లైనర్స్, స్టిలా స్ట్రే వంటి వాటర్ ప్రూఫ్ లిక్విడ్స్ ను మాత్రమే ఉపయోగించదు.

'చాలామంది జంతువుల చిత్రాలను తమ చేతులపై వేసుకోవడం చూస్తుంటాం.. నాకనిపించింది ఫుడ్ కు సంబంధించిన ఇల్యూషన్స్ ఎందుకు ప్రయత్నించకూడదని, ఆ ఆలోచనే సుషి ఇల్యూషన్' అంటూ చెప్పుకొచ్చింది మిమిఛోయ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+