ఇది ఖాయమే: 19 ఏండ్లలో యుగాంతం!.. నిగ్గు తేల్చిన నాసా
2036లో కలియుగం అంతం అవుతుందని నాసా శాస్త్రవేత్తలు తేల్చేశారు. దీనివల్ల ధరిత్రిపై మానవ సమాజం కూడా మనుగడ కోల్పోతుందని పేర్కొన్నారు.
Recommended Video

హూస్టన్/ లండన్: వచ్చే 19 ఏళ్లలో కలియుగం అంతమై పోతుందా? మానవ సమాజం మనుగడ మరో 19 ఏండ్లు మాత్రమేనా? అంటే అవుననే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. భూగోళాన్ని 2036 ఏప్రిల్ 13న అపోఫిన్ అనే గ్రహ శకలం ఢీ కొడుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహ శకలం ఢీకొనడంతో భూమిపై గల మానవ సమాజం పూర్తిగా అంతరించిపోతుందని చెప్తున్నారు.
తద్వారా ధరిత్రిపై మానవ సమాజం అంతరిస్తుందని నాసా శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు.2004లో తొలుత అపోఫిన్ గ్రహ శకలం ఉనికిని కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు స్టీవ్ చెస్లీ, పాల్ ఖోడాస్ గత 13 ఏండ్లుగా.. ప్రత్యేకించి 2009 నుంచి దాని కదలికలను గమనిస్తున్నారు. ఇది పర్వతాన్ని పోలి ఉంటుందని అంచనా వేశారు.

2029, 2068ల్లో భూమిని ఢీ కొడుతుందని రష్యన్ శాస్త్రవేత్తలు
హవాయి విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్ర సంస్థకు చెందిన డావె థోలెన్‌తో కలిసి దీని కదలికలను పరిశీలించిన స్టీవ్ చెస్లీ, పాల్ ఖోడాస్ 2036 ఏప్రిల్ 13న భూమిని ఢీ కొడుతుందని నిర్ధారణకు వచ్చారని వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయం అధికారి డువాన్ బ్రౌన్ చెప్పారు. మరోవైపు అపోఫిస్ 2029, 2068ల్లోనూ భూమికి అత్యంత సమీపానికి వస్తుందని రష్యన్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2029లో భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ సమయంలో చిన్న పొరపాటు జరిగినా భారీ విధ్వంసానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఇందుకు 2.7 శాతం అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భూకంపాలు, సునామీలు తదితర ప్రకృతి విపత్తులు ఎదురవుతున్న నేపథ్యంలో డేవిడ్ మేడ్ వంటి కుట్ర సిద్ధాంత కర్తలు గత నెల 15న, ఈ నెల 19 (ఆదివారం) నిబిరు అనే ఉపగ్రహం భూమిని ఢీకొడుతుందని చెప్పారు. అయితే వారి జోస్యం తప్పని తేలింది.

ఇలా రేడియో తరంగాల సందేశం ఇలా
టెక్నాలజీ అభివ్రుద్ధి చెందినా కొద్ది ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసుల అన్వేషణలో మరో ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అంతరిక్షంలోకి రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలు పంపారు. అందులో భాగంగా గ్రహాంతర జీవుల అన్వేషణలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు తాజాగా మరో ప్రయత్నం చేశారు. గ్రహాంతర జీవుల ఉనికిని కనుగొనేందుకు సౌరకుటుంబం సమీపంలోని నక్షత్ర మండలానికి రేడియో తరంగాల సందేశం పంపారు. ల్యూటెన్స్ నక్షత్రంగా పిలిచే జీజే-273 భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం. భూమి నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ నక్షత్ర కుటుంబంలో రెండు గ్రహాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటైన జీజే273బీ కేంద్రక నక్షత్రం చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. ఆ గ్రహంపై నీటిజాడలు ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సందేశం వెళ్లడానికి 25 ఏళ్ల సమయం పడుతుందని అంచనా
ల్యూటెన్స్ చుట్టు పరిభ్రమిస్తున్న అక్కడ జీవం ఉనికిలో ఉండే అవకాశముందని, గ్రహాంతరవాసులు ఉండవచ్చునని భావిస్తూ శాస్త్రవేత్తలు ఈ రేడియోతరంగాలతో సందేశాన్ని పంపారు. ‘ఒకవేళ ఆ మెసేజ్ వారికి చేరితే, వారి ప్రతిస్పందన మనకు 25 ఏళ్ల తర్వాత అందుతుంది. సమాధానమేదో వస్తుందని మేమైతే ఆశించడం లేదు. కానీ, ఒక ప్రయత్నంగా ఈ సందేశాన్ని పంపాం' అని మెసేజింగ్ ఎక్స్‌ట్రా-టెరిటోరియల్ ఇంటెలిజెన్స్ (ఎంఈటీఐ) అధ్యక్షుడు డౌగ్లస్ వాకోచ్ అభిప్రాయపడ్డారు. నార్వేలోని ఓ యాంటెనా నుంచి రేడియో సిగ్నల్స్ రూపంలో ఈ సందేశాన్ని ఎనిమిది గంటలపాటు పంపినట్లు ఆయన తెలిపారు. లెక్కింపు, అంకగణితం, జ్యామితి, త్రికోణమితితో ప్రారంభమైన సందేశంలో గడియారం పనితీరు, కాలగణన కూడా జోడించామని, జీజే273బీ గ్రహవాసులు తమ కాలంతో దాన్ని పోల్చుకునేందుకు ఈ ప్రయత్నంచేసినట్లు వాకోచ్ వెల్లడించారు. 1974లో పోర్టారికోలోని అరెకిబో రేడియో టెలిస్కోప్ ద్వారా ఓ నక్షత్రమండలానికి రేడియో సంకేతాలు పంపారు. అరెకిబో మెసేజ్‌కు 43 ఏండ్లు పూర్తయిన సందర్భంగా తాజా సందేశాన్ని పంపినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.












Click it and Unblock the Notifications