హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నో ర్యాగింగ్: టీ షర్ట్స్ పంచిన అనురాగ్, నైనా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ర్యాగింగ్ భూతాన్ని అందరూ ఏకమై తరిమి కొట్టాలని డిజిపి అనురాగ్ శర్మ మంగళవారం నాడు పిలుపునిచ్చారు.

ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా సే నో టు ర్యాగింగ్.. ఇట్ మైట్ కాస్ట్ యు పేరుతో ఎన్ఎండీసీ, మిడ్ నైట్ రిపోర్టర్ మాస పత్రిక సంయుక్తంగా చేపట్టిన ప్రచార సామాగ్రి కిట్‌ను ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ నైనా జైస్వాల్, మిడ్ నైట్ సంపాదకులు చైతన్య సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 నో ర్యాగింగ్

నో ర్యాగింగ్

ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎన్‌ఎండీసీ, ఇంగ్లీషు మాసపత్రిక సౌజన్యంతో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా సే నో టు ర్యాంగింగ్ - ఇట్ మైట్ కాస్ట్ యూ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం తన చాంబర్‌లో ప్రారంభించారు.

నో ర్యాగింగ్

నో ర్యాగింగ్

ప్రచార సామాగ్రిలో పలు రకాల పోస్టర్లు, బనియన్లు, స్టిక్కర్లు ఉన్న ప్రచార సామాగ్రి కిట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

నో ర్యాగింగ్

నో ర్యాగింగ్

విద్యార్థులనుద్దేశించి డీజీపీ మాట్లాడుతూ ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రచారం ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఉండాలన్నారు. ప్రతి సందేశం ప్రజల్లోకి వెళ్లినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

నో ర్యాగింగ్

నో ర్యాగింగ్

కలిసికట్టుగా కృషి చేసినప్పుడే ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టే అవకాశముందని డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు.

English summary
Telangana State Police has launched the No ragging Campaign in the state. The Poster and T-shirt was launched by Telangana State Director General Police Anurag Sharma IPS along with International table tennis player Naina Jaiswal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X