వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కళల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచేది కళాకారులేనని ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. విశాఖ ఫెస్ట్‌లో సామాజిక అంశాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. వైజాగ్‌ ఫెస్ట్‌-2015 పేరుతో విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో మంగళవారం రాత్రి జరిగిన రంగ స్థల సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

జాతిని మేల్కొలిపేది నాటక రంగమేనని ఆయన పేర్కొన్నారు. కార్మికులు పడే బాధలను విశాఖ కళాకారులు ఎంతో గొప్పగా నాటిక ప్రదర్శించారన్నారు. జీవితాన్ని కళలకు అంకితం చేసిన వారు ప్రజానాట్య మండలి కళాకారులని కొనియాడారు.

కళారూపాలను చూసి మారిన వారు ఎందరో ప్రముఖులు ఉన్నారని చెబుతూ ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సర్వీసులను 55 ఏళ్లకు కుదించారని, దానిపై తాను ఓ సినిమాలో సెటైరిక్‌గా రాసిన సంభాషణల నేపథ్యంలో తనతో అన్నగారు మాట్లాడి వాస్తవం గ్రహించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి 58 ఏళ్లకు రిటైర్మెంట్ పదవీ కాలాన్ని పొడిగించారని గుర్తు చేశారు.

నాటకాన్ని ప్రజలు చూడాలని, ప్రదర్శకులు ఎప్పటికప్పుడు అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం సవరించి చేసే ప్రదర్శనలు సమాజాన్ని ఎత్తి చూపుతాయని తన అభిప్రాయాన్ని చెప్పారు. అంకురం వంటి సినిమాలు కూడా వస్తే, ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తుందన్నారు.

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం బాగుందని కొనియాడారు. సామాన్యులకు మేలు చేయని ప్రైవేటీకరణను ప్రతిఘటించాలని, అభివృద్ధి ఎంత అవసరమో, సంక్షేమం కూడా అంతే అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్, సినీ దర్శకులు ఉమామహేశ్వరరావు, గీతాకృష్ణ, ఎమ్మెల్సీ శర్మ, విశాఖ ఫెస్ట్ కన్వీనర్ అజయ్ శర్మ, రంగ స్ధల దర్శకుడు బొట్ట వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే సాంస్కృతిక మండలి వ్యవస్ధాపకుడు కొసనాను ఘనంగా పరుచూరి చేతులమీదగా సత్కరించారు.

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

కళల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచేది కళాకారులేనని ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. విశాఖ ఫెస్ట్‌లో సామాజిక అంశాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

వైజాగ్‌ ఫెస్ట్‌-2015 పేరుతో విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో మంగళవారం రాత్రి జరిగిన రంగ స్థల సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

జాతిని మేల్కొలిపేది నాటక రంగమేనని ఆయన పేర్కొన్నారు. కార్మికులు పడే బాధలను విశాఖ కళాకారులు ఎంతో గొప్పగా నాటిక ప్రదర్శించారన్నారు. జీవితాన్ని కళలకు అంకితం చేసిన వారు ప్రజానాట్య మండలి కళాకారులని కొనియాడారు.

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

కళారూపాలను చూసి మారిన వారు ఎందరో ప్రముఖులు ఉన్నారని చెబుతూ ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సర్వీసులను 55 ఏళ్లకు కుదించారని అన్నారు.

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

దానిపై తాను ఓ సినిమాలో సెటైరిక్‌గా రాసిన సంభాషణల నేపథ్యంలో తనతో అన్నగారు మాట్లాడి వాస్తవం గ్రహించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి 58 ఏళ్లకు రిటైర్మెంట్ పదవీ కాలాన్ని పొడిగించారని గుర్తు చేశారు.

 విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

నాటకాన్ని ప్రజలు చూడాలని, ప్రదర్శకులు ఎప్పటికప్పుడు అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం సవరించి చేసే ప్రదర్శనలు సమాజాన్ని ఎత్తి చూపుతాయని తన అభిప్రాయాన్ని చెప్పారు. అంకురం వంటి సినిమాలు కూడా వస్తే, ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తుందన్నారు.

 విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం బాగుందని కొనియాడారు.

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

సామాన్యులకు మేలు చేయని ప్రైవేటీకరణను ప్రతిఘటించాలని, అభివృద్ధి ఎంత అవసరమో, సంక్షేమం కూడా అంతే అవసరమని అన్నారు.

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్, సినీ దర్శకులు ఉమామహేశ్వరరావు, గీతాకృష్ణ, ఎమ్మెల్సీ శర్మ, విశాఖ ఫెస్ట్ కన్వీనర్ అజయ్ శర్మ, రంగ స్ధల దర్శకుడు బొట్ట వేణు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

విశాఖ ఫెస్ట్‌లో పరుచూరి, ప్రజల్లో చైతన్యం

ఈ కార్యక్రమంలోనే సాంస్కృతిక మండలి వ్యవస్ధాపకుడు కొసనాను ఘనంగా పరుచూరి చేతులమీదగా సత్కరించారు.

English summary
Paruchuri Gopalakrishna attends 5th day of vizag fest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X