హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంజాన్: ఊరిస్తున్న హైదరాబాద్ హలీం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజానికి, హైదరాబాద్‌ పేరు వినగానే చార్మినార్‌, ఇరానీ ఛాయ్‌, బిర్యానీ గుర్తుకు వస్తాయి. వాటితో పాటు హలీం కూడా గుర్తుకు వస్తుంది. ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ప్రారంభం కాగానే వారి ఉపవాసదీక్షలు ఓవైపు కొనసాగుతుంటే, మరోవైపు మొత్తం హైదరాబాద్‌ మహానగరాన్ని కట్టిపడేస్తూ హలీం గుభాళింపులు వీస్తాయి. ఈసారి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కాక ముందే హలీం హైదరాబాదీలను ఊరిస్తోంది.

హలీమ్‌ తయారీ కేంద్రాలు ప్రత్యేకంగా వెలిసి, రుచికరంగా సంతృప్తినిచ్చేలా హలీం అందిస్తున్నారు. దీన్నితినేందుకు రాత్రివేళల్లో చాలా కేంద్రాల వద్ద భారీ క్యూలే మనకి దర్శమిస్తుంటాయి. కేవలం ముస్లిం సోదరులే కాదు హిందువులు కూడా దాన్ని ఆరగిస్తూ ఆనందాన్ని పొందుతారు. ప్రపంచంలో దాదాపు చాలా ముస్లిం దేశాలలో హలీం చేస్తున్నా, అంతర్జాతీయంగా ఓ గుర్తింపు తీసుకు వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం హైదరాబాదే.

రంజాన్‌ ఉపవాశదీక్షలని చేసే ముస్లింలకి హలీమ్‌ ప్రత్యేక వంటకం. ఓ వ్యక్తి మానసికంగా ఎంత బలవంతుడైనా కొన్ని గంటల పాటు కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుం డా ఉపవాశ దీక్షలు చేయటం వల్ల ఎవరిలోనైనా శారీరక బలహీనత రావటం సాధారణం. శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలను అందించే బలవర్థక ఆహారాలైన ఖర్జురం, ఎండు ద్రాక్ష, కిస్‌మిస్‌, జీడిపప్పు, బాదంపప్పు ఇలా పలువాటిని తీసు కోవటంతో నీరసించి పోవటం దాదాపు జరగదు. ఇవన్నీ తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థాలు. దీని తోడు అనేక పోషక విలువలు ఉన్న ఈ హలీమ్‌ని తీసుకోగానే వారిలో శక్తి తిరిగి వస్తుంది. రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చేలా ఉండటంతో హలీమ్‌ అందరి అభిమానాన్ని పొందుతోంది.

మలేషియా, సింగపూర్‌, సౌదీ అరేబియా వంటి దేశాలకు పోస్టల్‌, విమానాల ద్వారా హలీంను పంపిస్తున్నారు. హలీం ను ఆన్‌ లైన్‌ ద్వారా ఆర్డరిచ్చిన వెంటనే హలీం ఇంటికి చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. ఆర్డరందిన వెంటనే ప్రత్యేక బృందాలు వేడి వేడి హలీం డబ్బాలను ఆర్డరిచ్చిన వారికి చేరవేస్తారు.

హైదరాబాద్ హలీం

హైదరాబాద్ హలీం

రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా హలీం వాడుతారు. అయితే, రంజాన్ మాసం ప్రారంభం కావడానికి ముందే హలీం హైదరాబాదులో నోళ్లను ఊరిస్తోంది.

హైదరాబాద్ హలీం

హైదరాబాద్ హలీం

ఉపవాస దీక్షా సమయాలలో ప్రీతికరంగా మారిన హలీం వంటకాన్ని అనేక మంది తాము ఇచ్చే ఇఫ్తార్‌ విందుల్లో ప్రధానంగా చేశారు.

హైదరాబాద్ హలీం

హైదరాబాద్ హలీం

గోధుమ రవ్వ , నెయ్యి, మటన్(బోన్‌లెస్), పుట్నాల పప్పు (తినే శెనగ పప్పు), గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, తో తయారు చేస్తారు. లేత పొట్టేలు మాంసం అయితే రుచి బాగా ఉంటుంది.

హైదరాబాద్ హలీం

హైదరాబాద్ హలీం

మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకూ గూటా కర్రలతో రుబ్బుతారు.

హైదరాబాద్ హలీం

హైదరాబాద్ హలీం

మాంసాహారం భుజించని వాళ్లకోసం ప్రత్యేకంగా శాకాహార హలీం కూడా అందుబాటులోకి వచ్చింది. దాని రుచే వేరు కాబట్టి అలా ప్రాచుర్యంలోకి వచ్చంది.

హైదరాబాద్ హలీం

హైదరాబాద్ హలీం

హైదరాబాద్‌ నగరంలో హలీం తయారీలో ‘పిస్తాహౌస్‌' అంతర్జాతీయంగా పేరుగాంచింది. ‘ప్యారడైస్‌', ‘కేఫ్‌ 555', ‘హైదరాబాద్‌హౌస్‌' వంటి సంస్థలు కూడా హలీం తయారుచేస్తాయి.

English summary
Hyderabad Haleem will be a special recipe during Ramjan in Hyderabad. The haleem sales already started in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X