సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'(ఫోటోలు)

హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌ను ఏ ప్రణాళిక ద్వారా ఖాళీ చేయించాలనుకుంటున్నది స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పర్యావరణ వేత్తలు, సామాజిక ఉద్యమకారులు ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్‌లోని వ్యర్థాలను ఏమి చేస్తారో చెప్పకుండా ప్రక్షాళన ఎలా చేస్తారని నిలదీశారు.

గత ప్రాచీన హైదరాబాద్ అస్తిత్వాన్ని తుడిచేసి, మూసీ పరివాహక ఆవాసాలను, భూములను ముంచేసే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని, అవసరమైతే సీఎం కేసీఆర్‌పైనా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

‘సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌' (సోల్‌) ఆధ్వర్యంలో మంగళవారం నాడు ‘హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన- శాస్ర్తీయ విధానం' అనే అంశంపై పర్యావరణ వేత్తలు, సామాజిక ఉద్యమకారులతో సమావేశం జరిగింది. హుస్సేన్‌ సాగర గర్భంలో 30 నుంచి 40 లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలున్నాయని, వాటిని ఎక్కడ వేస్తారో ముందుగా చెప్పి.. ఆ తరువాత సాగర్‌ను ఖాళీ చేయించాలని ‘సోల్‌'' సభ్యురాలు డాక్టర్‌ లుబ్నాసార్వత్‌ కోరారు.

సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'

సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'


‘‘తెలంగాణ ప్రభుత్వ ప్రకటనతో నాలా పరీవాహక, మూసీ తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐపీసీ సెక్షన్‌ 505 ప్రకారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం నేరం. దీనిపై కేసు దాఖలు చేయొచ్చు'' అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై రాజీ పడేది లేదని, అవసరమైతే సీఎం కేసీఆర్‌పై కేసు దాఖలు చేసేందుకూ వెనుదీయబోమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తం రెడ్డి తేల్చిచెప్పారు.

 సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'

సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'

‘‘సాగర్‌ ప్రక్షాళన అవసరం. దానిని మేమూ స్వాగతిస్తాం. కాకపోతే ఈ పనిని శాస్ర్తీయ పద్ధతుల్లో చేపట్టాల్సి ఉంది. ముఖ్యంగా, వ్యర్థాలను మళ్లించకుండా ప్రక్షాళన చేస్తే ప్రయోజనమేంటి?'' అని ప్రశ్నించారు. చారిత్రక భవనాలను కూల్చి, సాగర్‌ చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం, ప్రాచీన హైదరాబాద్‌ అస్తిత్వానికే ముప్పు అని వాపోయారు.

 సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'

సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'


తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించకుంటే ప్రజలతో కలిసి మూసీ బచావో ఆందోళన్‌ చేపడతామన్నారు. వ్యర్థాల మళ్లింపు, శుద్ధి జలాలను సాగర్‌లోకి వచ్చేలా చూడడం ప్రక్షాళన లక్ష్యంగా ఉండాలని, నీటిని ఖాళీ చేయాలనే ఆలోచన ప్రమాదమని పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు మండిపడ్డారు. ఇప్పుడున్న ప్రణాళికను అమలుచేస్తే, ప్రక్షాళన క్రమంలో ప్రజలు ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడతారని పర్యావరణవేత్త సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు.

 సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'

సాగర్ ప్రక్షాళన: 'కేసీఆర్‌పైనా కేసు పెడతాం'


హుస్సేన్‌ సాగర్‌ శుద్ధికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ‘సోల్‌' సభ్యురాలు జస్విన్‌ జైరత్‌ డిమాండ్‌ చేశారు. సాగర్‌ చుట్టూ ఆకాశ హార్మ్లాల నిర్మాణం అనేది రియల్‌ ఎస్టేట్‌ ఎజెండాలో భాగమని దుయ్యబట్టారు. సాగర్‌ ప్రక్షాళనకు వెచ్చించే నిధులను తెలంగాణలోని చెరువుల అభివృద్ధికి వినియోగించాలని ప్రముఖ సామాజికవేత్త శ్రీధర్‌ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+