వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదారి పొంగు: ప్రకాశం బ్యారేజీ ఉధృతి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ముసురు, ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. ఏపీని భారీవానలు అతలాకుతలం చేస్తున్నాయి. రెండు మూడురోజులుగా విస్తారంగా కురుస్తోన్న వర్షాలకు పలు జిల్లాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏజన్సీ ప్రాంతంలో ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది.

శనివారం ఉదయం నుంచి చిరు జల్లులు, మరికొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల గోడలు కూలాయి. పలు గ్రామాల్లో గృహాలు నేలకొరిగాయి. ఏజెన్సీ ప్రాంతాలైన చింతూరు, కూనవరం మండలాల్లో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ముందుగానే సమాయత్తం కావాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.

రంపచోడవరం, ఐటిడిఏ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరంలోని బిసి కాలనీ పూర్తిగా జలమయమైంది. అయితే, భారీ వర్షాలు వ్యవసాయ పనులకు కొంత అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే, భారీ వర్షాలను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కంట్రోలు రూంలు ఏర్పాటు చేసింది.

వర్షాలు - వరదలు

వర్షాలు - వరదలు

అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులకు జలకళ వచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

వర్షాలు - వరదలు

వర్షాలు - వరదలు

ఏజెన్సీ ప్రాంతంలో కూడా సైతం విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, కిరండోల్ రైల్వే మార్గంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఆ మార్గంలో రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఏజెన్సీలో వాగులన్నీ పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వర్షాలు - వరదలు

వర్షాలు - వరదలు

ఒడిశాలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురియకపోవడంతో జిల్లాలో నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయా నదులు పొంగలేదు. శనివారం వేకువజాము నుంచి కుండపోత వర్షం ఏకదాటిగా కురియడంతో పంటపొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వ్యవసాయ పనులు జోరందుకునేందుకు ఈ వర్షాలు మరింత ఉపకరించాయి.

వర్షాలు - వరదలు

వర్షాలు - వరదలు

గత వారం రోజులుగా ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు కురుస్తుండటంతో వాగులు పొంగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నదికి అప్పుడే వరద తాకిడి మొదలైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలో అనేకచోట్ల వాగులు ఉద్ధృతంగా రోడ్ల మీదనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు.

 వర్షాలు - వరదలు

వర్షాలు - వరదలు

మునేరు పొంగి ప్రవహిస్తోంది. పులివాగు, చెరువుమాధవరం గ్రామం లో లెవెల్ చప్టాపై వరద నీరు ప్రవహిస్తోంది. తెల్లదేవరపాడులో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పులివాగుపై ఉన్న వంతెన కుప్పకూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి నీరు రాకపోయినా స్థానికంగా కురిసిన వర్షపు నీరు చేరి నీటితో బ్యారేజీ కళకళలాడుతోంది.

 వర్షాలు - వరదలు

వర్షాలు - వరదలు

బ్యారేజీ 70 గేట్లకుగాను 15 గేట్లను అడుగుమేర పైకెత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అలాగే కాలువలకు కూడా నీరు అధికంగా వదులుతుండడంతో లోతట్టు పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని కాలువలకు నీరు నిలుపు చేయాలని పలువురు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.

 వర్షాలు - వరదలు

వర్షాలు - వరదలు

ఖమ్మం జిల్లా తాలిపేరు ఉగ్రరూపం దాల్చింది. ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ఉత్పత్తి నిలిచిపోయింది.

English summary
Rains pound Telangana, coastal Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X