మా మంచి సిఇవో: జీతానికి కోత పెట్టుకున్నాడు

సియాటిల్: అమెరికాలోని ఓ సంస్థకు చెందిన కుర్ర సిఇవో ఉద్యోగుల పట్ల అత్యంత ప్రేమపూరితంగా వ్యవహరించాడు. అమెరికాలో ఉద్యోగుల ఆనందానికి గల కారణాలపై ఓ వ్యాసం చదివిన ఓ యువ సిఇఒ తన దగ్గర పనిచేసే ఉద్యోగుల జీతాలను పెద్దమొత్తంలో పెంచాలని నిర్ణయించుకోవడమే కాకుండా ఇందుకోసం ఏకంగా తన వేతనాన్ని 90 శాతం మేర తగ్గించుకున్నాడు.

అతను దానితో ఆగక ఇందుకోసం సంస్థ లాభాల్లో భారీ మొత్తాన్ని కేటాయించాడు. టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థ గ్రావిటీ పేమెంట్స్‌ వ్యవస్థాపకుడు, సిఇఒ డాన్‌ ప్రైస్ దాన్ని ఆచరణలో చూపించాడు‌. వచ్చే మూడేళ్లలో తన సంస్థలో ఉద్యోగులందరూ కనీసం 70 వేల డాలర్ల వార్షిక వేతనం పొందేలా చూడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాన్‌ చెప్పాడు.

ఇందుకోసం పదిలక్షల డాలర్లున్న తన వార్షిక వేతనాన్ని 70 వేల డాలర్లకు తగ్గించుకోవడమే కాక, సంస్థ లాభాల్లోంచి 20 లక్షల డాలర్లను కేటాయించాడు. తాను బతకడానికి ఈ మొత్తం సరిపోతుందని డాన్‌ చెబుతున్నాడు. కేవలం సిఇఒకు అంతంత జీతం ఉండడం సంస్థకు కూడా మంచిది కాదని, తన నిర్ణయంతో తనకేమైనా కంపెనీ మనగలుగుతుందని అన్నాడు.

Seattle CEO Dan Price cuts own salary

డాన్‌ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న 30 మంది వేతనాలు రెండింతలు పెరిగాయి. మరో 40 మంది వేతనాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 75,000 డాలర్ల వార్షికాదాయం ఉద్యోగి భావోద్వేగపరంగా మంచి స్థితిలో ఉండేందుకు దోహదం చేస్తుందన్న అధ్యయనాన్ని చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాన్‌ చెప్పాడు.

దీంతోపాటు తక్కువ జీతాలతో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తన సంస్థలో ఉద్యోగులు చెప్పుకునే మాటలు విన్న అనంతరం సిఇఒకు, ఇతర వర్కర్లకు మధ్య వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉండకూడదని భావించినట్లు డాన్‌ చెప్పాడు. ఈ పెంపుదల న్యాయంగా వారికి చెందాల్సిన హక్కు అని ఆయన అన్నాడు.

ఇలా వేతన వ్యత్యాసాలను తగ్గించాలన్న నిర్ణయం తీసుకున్న ఏకైక సిఇఒ తానొక్కరే కాదని, మరో 100 మంది సిఇఒలు మెయిల్స్‌ ద్వారా, మెసేజ్‌ల ద్వారా తాము కూడా ఇదే బాటలో పయనిస్తామని చెప్పారని డాన్‌ వెల్లడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+