ఫ్రెషర్స్‌పై పిడుగు?.. ఐటీ ఉద్యోగం కష్టమేనంటున్న సర్వే: ఇదీ వాస్తవ పరిస్థితి..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దేశంలో బెంగళూరు తర్వాత ఐటీకి కేరాఫ్‌గా ఉంది హైదరాబాద్. టెక్నికల్ డిగ్రీ చేతికందగానే ఉద్యోగం కోసం హైదరాబాద్ బాటపట్టే ఫ్రెషర్స్ చాలామందే ఉన్నారు.

అయితే ఐటీ రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల కారణంగా.. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్ తగ్గిపోయాయి. ప్రముఖ ఉద్యోగ ప్రకటనల వెబ్‌సైట్‌ నౌక్రీ.కామ్‌ తన తాజా సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించింది.

నౌక్రీ.కామ్ సర్వే:

నౌక్రీ.కామ్ సర్వే:

నౌక్రీ.కామ్ సర్వే ప్రకారం.. గత ఏడాది కాలంగా ఐటీ రంగంలో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. అలాగే ఐటీ ఉద్యోగాల్లో వృద్ధి రేటు పరంగా ఈసారి కోల్‌కతా టాప్‌లో నిలవడం విశేషం. 40 శాతం జాబ్ ఓపెనింగ్స్‌తో కోల్‌కతాలో ఐటీ బూమ్ బాగుందని సర్వే వెల్లడించింది.

ఐటీకి ఏమైంది?: కెరీర్‌పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..

హైదరాబాద్ స్థానమెంత?:

హైదరాబాద్ స్థానమెంత?:

కోల్‌కతా తర్వాత చెన్నై రెండో స్థానంలో నిలిచింది. చెన్నైలో ఏడాది కాలంగా 15 శాతం జాబ్ ఓపెనింగ్స్ నమోదైనట్టు తెలిపింది. ఇక 7 శాతంతో మూడో స్థానంలో ఢిల్లీ, 5శాతంతో నాలుగో స్థానంలో బెంగళూరు, 4శాతంతో ఐదో స్థానంలో హైదరాబాద్ నిలిచాయి. 2016- 2017 డిసెంబర్‌ వరకు దేశంలోని మెట్రో నగరాల్లో ఐటీ పోకడల ఆధారంగా ఈ సర్వే చేపట్టారు.

మందగమనానికి కారణమిదే..:

మందగమనానికి కారణమిదే..:

హైదరాబాద్ విషయానికొస్తే.. ఐటీ రంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులే జాబ్ ఓపెనింగ్స్ మందగమనానికి కారణమని సర్వే వెల్లడించింది. అంతర్జాతీయ ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో రాకపోతుండటం.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అనుభవజ్ఞులకే కంపెనీలు పెద్ద పీట వేస్తుండటంతో ఫ్రెషర్స్‌కు ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ లేవని తెలిపింది.

సాఫ్ట్ వేర్ అల్లుడా?.. వద్దు బాబోయ్: కాలం మారింది.. ఐటీ 'కళ' చెదిరింది

అనుభజ్ఞులకే పెద్ద పీట..:

అనుభజ్ఞులకే పెద్ద పీట..:


హైదరాబాద్ లో సుమారు 1200సాఫ్ట్ వేర్ మల్టీ నేషనల్ కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 6లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.

అయితే గడిచిన కొంతకాలంగా కంపెనీల విస్తరణ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపించింది. పైగా ఫ్రెషర్స్ కంటే మూడేళ్ల అనుభవం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో టెక్నికల్ డిగ్రీ పట్టుకుని హైదరాబాద్ వచ్చే ఫ్రెషర్స్‌కు కష్టాలు తప్పడం లేదు.

దూసుకెళ్తున్న ఆటోమొబైల్ రంగం:

దూసుకెళ్తున్న ఆటోమొబైల్ రంగం:

ఐటీ రంగంలో ఓపెనింగ్స్ మందగించగా.. ఆటోమొబైల్ రంగంలో మాత్రం 31శాతం ఉపాధి అవకాశాలు పెరిగినట్టు సర్వే వెల్లడించింది. బీమా(ఇన్సూరెన్స్) రంగంలోనూ 21శాతం మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్టు తెలిపింది.

త్వరలోనే పుంజుకోవచ్చు:

త్వరలోనే పుంజుకోవచ్చు:


కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న ఐటీఐఆర్‌ ప్రాజెక్టు నాలుగేళ్లయినా అందుబాటులోకి రాలేదు. ఈ ప్రాజెక్టు గనుక త్వరగా పూర్తయితే ఫ్రెషర్స్‌కు మళ్లీ అవకాశాలు పెరగవచ్చు అని నౌక్రీ.కామ్ సర్వే వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీ, టీఎస్‌ఐపాస్‌ పాలసీలు కూడా త్వరలోనే మంచి ఫలితాలిచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

తగ్గలేదంటున్న నిపుణులు..:

తగ్గలేదంటున్న నిపుణులు..:

నౌక్రీ.కామ్ సర్వేపై స్పందించిన ఐటీ నిపుణులు మాత్రం ఐటీ ఎగుమతుల వృద్ధి జాతీయ సగటుతో పోలిస్తే నగరంలోనే అధికమని చెప్పడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో కొత్తగా 45 పైచిలుకు మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చాయని, లక్ష మందికి ఉపాధికి లభించిందని చెబుతున్నారు. టీఎస్ఐపాస్ వల్ల నగరంలో తమ సంస్థలను విస్తరించేందుకు చాలా కంపెనీలు సిద్దంగా ఉన్నాయన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Naukri.com conducted a survey across the country especially in Metro cities on IT Openings. In this list Hyderabad got fifth place with 4% of growth rate in it openings.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X