వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్తా చాటిన తేజస్వి: వారం వ్యవధిలోనే ఐదు ఉద్యోగాలు సాధించింది

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సంపాదించాలంటేనే ఓ తపస్సు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఓ యువతి మాత్రం కఠోర శ్రమ, ప్రత్యేక సాధనతో ఏకంగా ఐదు ఉద్యోగాలను ఒకేసారి సాధించి సంచలనం సృష్టించింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సంపాదించాలంటేనే ఓ తపస్సు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఓ యువతి మాత్రం కఠోర శ్రమ, ప్రత్యేక సాధనతో ఏకంగా ఐదు ఉద్యోగాలను ఒకేసారి సాధించి సంచలనం సృష్టించింది. ఆమే కృష్ణాజిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన పగుట్ల తేజస్వి.

గత వారం రోజుల వ్యవధిలోనే ఆమె న్యూ ఇండియా ఎస్యూ రెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌లో పరిపాలనా అధికారిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌‌గా, కెనరా బ్యాంకులో ప్రోబిషనరీ ఆఫీసర్‌గా, సిండికేట్‌ బ్యాంకులో క్లర్క్‌గా, ఏపీ కోఆపరేటివ్‌ బ్యాంకులో క్లర్క్‌గా వరుసపెట్టి ఉద్యోగాలను సాధించారు.

Krishna district girl tejaswi have got five jobs in a week time.

అంతేగాక, సెంట్రల్‌ వేర్‌ కార్పొరేషన్‌లో మేనేజర్‌ ఉద్యోగం కోసం ఇటీవల ఢిల్లీలో ఇంటర్వ్యూకు హాజరయ్యారు తేజస్వి. అందులోనూ విజయం సాధిస్తానని తేజస్వి ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, తాను మాత్రం న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీలో పరిపాలనా అధికారిగా చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

తేజస్వి బీఎడ్‌ పూర్తి చేశాక ఎంబీఏ చేసింది. గత సంవత్సరం వ్యవసాయ శాఖలో ఎంపీఈవోగా ఉద్యోగం సాధించి చాట్రాయి మండలంలో పనిచేశారు. పోటీ పరీక్షలకు ఇబ్బందిగా ఉందని ఆరు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సివిల్స్‌లో విజేతగా నిలవాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశగా సాధన చేస్తానని తేజస్వి తెలిపారు.

కాగా, తేజస్వి తండ్రి పగుట్ల ప్రసాద్‌ కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం కొర్లమండ శివారు షేపూరివారిపాలెంలో ఆర్‌సీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
తల్లి కుమారి గృహిణిగా ఉన్నారు. సోదరుడు ప్రశాంత్‌కుమార్‌ బీటెక్‌ పూర్తి చేసి పోటీ పరీక్షలకు హాజరవుతున్నాడు.

English summary
Krishna district girl tejaswi have got five jobs in a week time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X