హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంక్రాంతి సందడి: భోగి మంటలు, రద్దీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి పండుగశోభతో వెలిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో పతంగుల పండుగ, జానపద కళాజాతాల ప్రదర్శనలు పండుగకు కొత్తశోభను అందిస్తున్నాయి. రవీంద్రభారతి ఆడిటోరియం, శిల్పారామం, ఆగాఖాన్ మైదానం, శిల్పకళావేదిక, బాబూ జగ్జీవన్‌రాం వంటి కళాకేంద్రాలన్నీ సంక్రాంతి పండుగ కేంద్రాలయ్యాయి.

రవీంద్రభారతిలో గురువారం నుంచి మూడ్రోజులపాటు సంక్రాంతి సంబురాలు జరుగనున్నాయి. గంగిరెద్దుల కళాకారులు, బుడుబుడుకలు, కాటికాపరులు, డప్పువిన్యాసాలు, తదితర కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

శిల్పారామంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన జానపదకళాకారులు, మైమ్, లంబాడా, గిరిజన నృత్యాలతో కళారూపాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. శిల్పారామంలో, ఆగాఖాన్ మైదానంలో పతంగుల పండుగను నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.

పండగ రద్దీ

సంక్రాంతి ప్రయాణీకుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణ ప్రాంగణాల్లో ఇసకేస్తే రాలని రద్దీ కనిపిస్తోంది. సగటు ప్రయాణికుడి పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుంది. రిజర్వేషన్ టిక్కెట్లున్న వారికీ ప్రయాణ అగచాట్లు తప్పడం లేదు.

ఇక లేనివాళ్ల పరిస్థితి మరీ దారుణం. ఏదోక రైలు పట్టుకుని నిలబడైనా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో పండుగ జనం బస్సు, రైల్వే స్టేషన్లకు చేరుతున్నారు. దీంతో ప్రయాణ ప్రాంగణాలు పూర్తిగా రద్దీగా మారిపోయాయి.

రైల్వే స్టేషన్లో రద్దీ

రైల్వే స్టేషన్లో రద్దీ

సంక్రాంతి ప్రయాణీకుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణ ప్రాంగణాల్లో ఇసకేస్తే రాలని రద్దీ కనిపిస్తోంది.

గంగిరెద్దుల సందడి

గంగిరెద్దుల సందడి

తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి పండుగశోభతో వెలిగిపోతున్నాయి.

భోగి మంటలు

భోగి మంటలు

హైదరాబాద్‌లో పతంగుల పండుగ, జానపద కళాజాతాల ప్రదర్శనలు పండుగకు కొత్తశోభను అందిస్తున్నాయి.

భోగి మంటలు

భోగి మంటలు

రవీంద్రభారతి ఆడిటోరియం, శిల్పారామం, ఆగాఖాన్ మైదానం, శిల్పకళావేదిక, బాబూ జగ్జీవన్‌రాం వంటి కళాకేంద్రాలన్నీ సంక్రాంతి పండుగ కేంద్రాలయ్యాయి.

ఇంటిబాట

ఇంటిబాట

రవీంద్రభారతిలో గురువారం నుంచి మూడ్రోజులపాటు సంక్రాంతి సంబురాలు జరుగనున్నాయి.

పతంగుల సందడి

పతంగుల సందడి

గంగిరెద్దుల కళాకారులు, బుడుబుడుకలు, కాటికాపరులు, డప్పువిన్యాసాలు, తదితర కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

పతంగుల సందడి

పతంగుల సందడి

శిల్పారామంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన జానపదకళాకారులు, మైమ్, లంబాడా, గిరిజన నృత్యాలతో కళారూపాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

పండగ పయనం

పండగ పయనం

సంక్రాంతి ప్రయాణీకుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణ ప్రాంగణాల్లో ఇసకేస్తే రాలని రద్దీ కనిపిస్తోంది.

రైల్వే స్టేషన్ లో‌రద్దీ

రైల్వే స్టేషన్ లో‌రద్దీ

సగటు ప్రయాణికుడి పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుంది. రిజర్వేషన్ టిక్కెట్లున్న వారికీ ప్రయాణ అగచాట్లు తప్పడం లేదు. ఇక లేనివాళ్ల పరిస్థితి మరీ దారుణం.

ప్రయాణికుల రద్దీ

ప్రయాణికుల రద్దీ

ఏదోక రైలు పట్టుకుని నిలబడైనా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో పండుగ జనం బస్సు, రైల్వే స్టేషన్లకు చేరుతున్నారు. దీంతో ప్రయాణ ప్రాంగణాలు పూర్తిగా రద్దీగా మారిపోయాయి.

ప్రయాణికుల రద్దీ

ప్రయాణికుల రద్దీ

ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాంలు, స్టేషన్ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తోంది. నిత్యం నడిచే రైళ్లకుతోడు ప్రత్యేక రైళ్లను పెద్దఎత్తున రైల్వే నడుపుతున్నందున, ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.

English summary
Telugu states ready to celebrate sankranti festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X