వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15ఏళ్లకోసారి: ఇందుకే నేడు చిన్నబోనున్న చందమామ!

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా కనిపించడం సహజం. అయితే ఈ శుక్రవారం పున్నమి రోజున మాత్రం చంద్రుడు కాస్త చిన్నగా కనిపించనున్నాడు.'మినీ మూన్'గా శాస్తజ్ఞ్రులు అభివర్ణించే ఈ సంఘటన మరో 15 ఏళ్లకోసారి మాత్రమే సంభవిస్తుంది.

భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9.35 గంటల సమయంలో భూమి చుట్టూ పరిభ్రమించే చంద్రుడు తన కక్ష్యలో సుదూరమైన పాయింట్‌వద్ద-అంటే భూమినుంచి దాదాపు 4,06,350 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మామూలుగా అయితే చంద్రుడు భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.

శుక్రవారం నిండుపున్నమి సంభవించినప్పుడు చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉండే పాయింట్‌కు దగ్గర్లో ఉంటాడని, అందువల్ల మామూలుగా ఉండే సైజుకన్నా చిన్నగా ఉంటాడని కోల్‌కతా ఎంపి బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేవి ప్రసాద్ దువారి పిటిఐకి తెలిపారు.

The Truth About Tonight's Stunning Pink Moon

శుక్రవారం ఉదయం 10.55 గంటలకు పగటిపూట ఈ అరుదైన సంఘటన జరుగుతుంది గనుక ఇది మన కంటికి కనిపించదు. అయితే శుక్రవారం రాత్రి పూట మాత్రం 'మినీ మూన్' కాస్త చిన్నగా కనిపిస్తాడు. కాగా, ఇలాంటి సంఘటన మళ్లీ 2030 డిసెంబర్ 10న సంభవిస్తుందని ప్రసాద్ చెప్పారు.

భూమికి అత్యంత చేరువగా వచ్చినప్పుడు సూపర్‌మూన్‌గా.. దూరంగా ఉన్నప్పుడు మినీ మూన్‌గా దర్శనిమిస్తాడని దౌరీ పేర్కొన్నారు. అయితే ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్నట్లుగా సమయంలో చంద్రుడు లేత ఎరుపు(పింక్)లేదా పసుపు రంగులో కానీ ఉండడని, మామూలుగా ఉండే ధవళ వర్ణంలోనే ఉంటాడని ఆయన చెప్పారు.

అయితే, గులాబీ రంగులో చంద్రుడు కనిపిస్తాడని పలువురు పేర్కొంటుండటం గమనార్హం. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే 'సూపర్‌మూన్'తో పోలిస్తే 'మినీ మూన్' సైజు 14 శాతం తక్కువగా ఉంటుంది.

English summary
Tonight, if you look up at the sky, you're going to see a once-yearly event: the Pink Moon. But despite its rosy name, tonight's moon is not a watered-down version of the fiery-red Blood Moon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X