ఎంఎస్ సుబ్బులక్ష్మికి మరో అరుదైన గౌరవం..
ఐరాస : సంగీత ప్రపంచంలో ఎల్లలు దాటిన ఖ్యాతి గడించిన కర్ణాటక సంగీత శిఖరాగ్రం ఎంఎస్ సుబ్బులక్ష్మికి అంతర్జాతీయంగా మరో అరుదైన గౌరవం దక్కనుంది. సుబ్బులక్ష్మి ముఖచిత్రంతో ఓ స్టాంపును విడుదల చేయాలన్నఐరాస నిర్ణయం పట్ల ఆమె అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సుబ్బులక్ష్మి శతజయంతిని పురస్కరించుకుని.. భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సుబ్బులక్ష్మి స్టాంపును విడుదల చేయాలని నిర్ణయించింది ఐరాస. ఇదే విషయాన్ని ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయం కూడా ధ్రువీకరించింది.
ఇదిలా ఉంటే.. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో ఉన్న ప్రధాన హాలులో ఆస్కార్ విజేత ఏఆర్ రెహామాన్ తో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు అధికారులు. ఐరాస దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే హాలులో భారత్ తరుపున 1966లో సుబ్బులక్ష్మి తన సంగీత కచేరీ చేయగా.. ఇప్పుడు ఆ అవకాశం రెహామాన్ కు దక్కడం విశేషం.












Click it and Unblock the Notifications