• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీదర్ టు హైదరాబాద్: ఎవరీ ఇరానీ గ్యాంగ్ లీడర్?

By Pratap
|

హైదరాబాద్‌: గత నాలుగేళ్లుగా హైదరాబాద్, సికింద్రాబాద్ కమిషనరేట్ల పోలీసులను ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ వచ్చిన ఇరానీ గ్యాంగ్ లీడర్ బాబర్ అలియాస్ బాకర్ అక్రమ్ అలీ ఎట్టకేలకు చిక్కాడు. ఖరీదైన బైక్‌లపై బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చి నాలుగైదు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి బీదర్‌కు చిత్తగించడం అతను అలవాటుగా చేసుకున్నాడు. 2012 నుంచి అతని మీద హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధుల్లో 102 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి.

బాబర్‌ నేరచరిత్ర ముంబై నుంచి మొదలైందని చెబుతారు. ఓ చీటింగ్‌ కేసులో ముంబై పోలీసులు బాబర్‌ను అరెస్టు చేశారు. అక్కడ జైలు నుంచి విడుదలైన తర్వాత స్నాచింగ్‌లు చేయడం ప్రారంభించాడు. స్నాచింగ్‌లకు వెళ్లేటప్పుడు ఎదురుతిరిగిన వారిని బెదిరించడానికి వెంట ఒక కత్తి పెట్టుకునేవాడు. ముంబై, పుణే, గుల్బర్గా పోలీసుల జాబితాలో బాబర్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. అక్కడా ఇటువంటి నేరాలే చేశాడని సమాచారం. ఆయా నగరాల పోలీసులు ఇప్పటికీ బాబర్‌ కోసం గాలిస్తున్నారు.

ఇలా స్నాచింగ్‌లు చేయగా వచ్చిన డబ్బులతో బీదర్‌లోని ఇరానీ గల్లీలో ఒక భవనం నిర్మించాడు. అలాగే మూడు నాలుగు చోట్ల స్థలాలు కొనుగోలు చేశాడని తెలిసింది. ఇవి కాకుండా బ్యాంక్‌ ఖాతాలో కొంత డబ్బు ఉన్నట్టు తెలుస్తోంది.

Who is Irani gang leader Abu Bakar?

బీదర్‌ నుంచి బాబర్‌ బైక్‌పై తన గ్యాంగ్‌లో ఒకర్ని తీసుకుని హైదరాబాద్‌ వచ్చేవాడు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వెనుక నుంచి వచ్చి మెడలోని ఆభరణాలను తెంపుకుని పోయేవారు. ఒకేరోజు మూడు నుంచి ఆరు స్నాచింగ్‌లు చేసేవారు. తర్వాత వెంటనే బైక్‌పై బీదర్‌ పారిపోయేవారు. ఇలా దొంగిలించిన ఆభరణాలను గుల్బర్గాలోని గణేష్‌నగర్‌ రింగ్‌ రోడ్డుకు చెందిన రుద్నూర్‌ మల్లికార్జున్‌, బీదర్‌ బసవనగర్‌కు చెందిన కె.రాంప్రసాద్‌కు విక్రయిస్తుండేవారు.

బాబర్ గ్యాంగ్‌లో వీరు...

బాబర్‌ గ్యాంగ్‌లో ఫిదా అలీ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జైల్లో ఉండగా, ఇక్బాల్‌ నవీ ముంబైలోని టలోజా సెంట్రల్‌ జైల్లో, ఆషిక్‌ హుస్సేన్‌ చర్లపల్లి జైల్లో ఉన్నారు. అసదుల్లా అబూ ఇరానీ మాత్రం పరారీలో ఉన్నాడు. బీదర్‌లో సన్‌గ్లాస్‌ కళ్లజోళ్లను అమ్ముతూ హైదరాబాద్‌లో నేరాలు చేశారు. బాబర్‌ గురించి పక్కా సమాచారం అందుకున్న తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, ఎస్‌ఐ సుధాకర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ పి.వెంకటస్వామి, కానిస్టేబుళ్లు ఎండీ మొబినుద్దీన్‌, జి.సురేష్‌ అతడ్ని అరెస్టు చేశారు.

Who is Irani gang leader Abu Bakar?

బాబర్‌ దొంగిలించిన వస్తువులను బీదర్‌కు చెందిన రాంప్రసాద్‌కు విక్రయించడంతో అతడ్నీ అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం మూడు కిలోల 46గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో 70, సైబరాబాద్‌లో 26, మెదక్‌ జిల్లాలో ఆరు కేసులకు సంబంధించిన వస్తువులను రికరీ చేశామని తెలిపారు.

ఇరానీ గ్యాంగ్ లీడర్ బాబర్ అరెస్టుకు సంబంధించిన సంబంధించిన వివరాలను కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు కమిషనర్‌ అంజనీకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సంయుక్త కమిషనర్‌ వై.నాగిరెడ్డి, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ అదనపు ఉపకమిషనర్‌ నంద్యాల కోటిరెడ్డితో కలిసి సోమవారం వెల్లడించారు.

ఇరానీ గ్యాంగ్ లీడర్ బాబర్‌తో పాటు చోరీ ఆభరణాలను కొనుగోలు చేసిన బీదర్‌కు చెందిన కె.రాంప్రసాద్‌ను అరెస్టు చేశారు.

English summary
Irani gang leader Babar alias abu bakar ali criminal activity started from Mumbai. He lives at Iranai colony of Karanataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X