కన్నీరు తుడిచిన జగన్, విజయమ్మ స్పీచ్(పిక్చర్స్)

విజయనగరం/కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో 9ఏళ్ల దుర్మార్గపు పాలన కొనసాగించిన చంద్రబాబు నాయుడు, ఏ గడ్డి కరిచైనా మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన ‘వైయస్సార్ జనభేరి' బహిరంగ సభలో మాట్లాడారు.

రాష్ట్రంలో తొమ్మిదేళ్ల చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడిన దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు సువర్ణయుగాన్ని అందించారని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని వైయస్సార్ చాటి చెప్పారని తెలిపారు. ఆ దివంగత రాజశేఖర్ రెడ్డి తనకు వారసత్వంగా ఇచ్చింది ఏదైనా ఉందంటే అది విశ్వసనీయతేనని జగన్ చెప్పారు.

విశ్వసనీయత అన్న పదానికి అర్థం చంద్రబాబుకు ఈ జన్మకు తెలియనే తెలియదని అన్నారు. అందుకే నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను పట్టపగలే మోసం చేయాలని చూస్తున్నారని చంద్రబాబుపై జగన్ ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓ వైపు నిజాయితీ, విశ్వసనీయత ఉంటే.. మరో వైపు అధర్మం, కుళ్లు, కుతంత్రాలు ఉండి పోటీపడుతున్నాయని అన్నారు.

స్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చారు: విజయమ్మ

కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన 9ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని స్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో నిర్వహించిన రోడ్ షోలో విజయమ్మ ప్రసంగించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చారా, రుణమాఫీ చేశారా, ప్రాజెక్టులు కట్టారా అని విజయమ్మ ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దాల కోరు అని ఆమె ఆరోపించారు.

జగన్ ఓదార్పు

జగన్ ఓదార్పు

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో శుక్రవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు.

కన్నీరు తుడుస్తూ..

కన్నీరు తుడుస్తూ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన ‘వైయస్సార్ జనభేరి' బహిరంగ సభలో మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో రాష్ట్ర ప్రజలకు సువర్ణయుగాన్ని అందించారని జగన్ అన్నారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని వైయస్సార్ చాటి చెప్పారని జగన్ తెలిపారు. ఆ దివంగత రాజశేఖర్ రెడ్డి తనకు వారసత్వంగా ఇచ్చింది ఏదైనా ఉందంటే అది విశ్వసనీయతేనని జగన్ చెప్పారు.

భారీగా తరలివచ్చిన జనం

భారీగా తరలివచ్చిన జనం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన 9ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని స్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు.

ప్రసంగిస్తూ..

ప్రసంగిస్తూ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో నిర్వహించిన రోడ్ షోలో విజయమ్మ ప్రసంగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+