దేవతలమహత్యం తెలుసుకున్న షూ కంపెనీ
చంఢీగఢ్‌ః బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్ ఉత్తర అమెరికాలోని సిక్కుల సమస్యను ఇప్పుడు తలకెత్తుకున్నారు. అక్కడికి వలస వెళ్ళిన సిక్కులు తమ మాతృభూమిని సందర్శించేందుకు వీలుగా వారికి, భారత ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేయనున్నట్టు ఆయన చెప్పారు. చాలా మంది సిక్కులు తాము పుట్టిన గడ్డను సందర్శించుకునే భాగ్యానికి నోచుకోలేక పోతున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ కు వ్యతిరేకంగా భావోద్వేగాలు ఆపుకోలేక వారు భారత్ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొనడమే ఇందుకు కారణం అని రాజ్ బబ్బర్ పేర్కొన్నారు. అమృతసర్ స్వర్ణదేవాలయం నుంచి సాయుధ సిక్కు తీవ్రవాదులను తరిమికొట్టడానికి 1984 జూన్ లో భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించింది. అప్పట్లో సంత్ జర్నేల్ సింగ్ బింద్రన్ వాలే నాయకత్వంలో తీవ్రవాదులు సిక్కులకు ప్రత్యేక రాజ్యం కావాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications