వైయస్ కు పొంచి ఉన్న ముప్పు

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు తిరుగులేని మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో 77 సీట్లను కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ తన శాసనసభ్యల సంఖ్యను రెండింతలు పెంచుకుంది.2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 47 సీట్లను మాత్రమే సాధించగా ఈసారి 93 స్థానాలు సాధించింది. మహాకూటమి పొరపాటు వల్ల తాము అధికారంలోకి రాలేకపోయామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నప్పటికీ లోకసత్తా, ప్రజారాజ్యం పార్టీల వల్ల జరిగిన నష్టాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోలేకపోతున్నారు. ఆ పార్టీల స్వరూప స్వభావాలను, వ్యవస్థాగత పద్ధతి అంతా తెలుగుదేశం ఓటు బ్యాంకును చీల్చేవిగానే ఉన్నాయి గానీ కాంగ్రెసును నష్టపరిచేవిగా లేవు.
ప్రజారాజ్యం పార్టీ ఉప్పెనలా వచ్చి చిరుగాలిలా తేలిపోయింది. కుల సమీకరణాల వల్ల చిరంజీవి పార్టీ చతికిలపడిపోయింది. తెలుగుదేశం పార్టీ మిత్ర పక్షాలు సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఈ ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని చవి చూశాయి. మహా కూటమిలోనే పెద్ద తప్పుందనే విషయాన్ని కమ్యూనిస్టులు గానీ, తెలుగుదేశం గానీ గుర్తించలేకపోతున్నాయి. తమ తప్పిదాలను తెరాస మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెరాసను తెర వెనక నుంచి దెబ్బ తీసే ప్రయత్నాల వల్లనే ఆ పార్టీలు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాయి. తెరాస 10 అసెంబ్లీ స్థానాలను, రెండు లోకసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సిపిఐ నాలుగు శాసనసభా స్థానాలను గెలుచుకోగా, సిపిఎం ఒక్క స్థానాన్ని మాత్రమే సాధించింది. లోకసభ స్థానాలను ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు చర్యలకు కాలం చెల్లుతుందనే విషయాన్ని ఆ పార్టీలు గుర్తించే స్థితిలో లేవు. దేశవ్యాప్తంగా సిపిఎం, సిపిఐలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. అదే రీతిలో రాష్ట్రంలో ఆ పార్టీలు దెబ్బ తినడమే కాకుండా ఆ పార్టీలపై ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీపై కూడా పడింది. దాంతో తెలుగుదేశం, తెరాసలకు లోకసభ స్థానాలు తగ్గాయి.
దేశ పరిణామాల కారణంగానే కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాల్లో 33 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్ర శాసనసభలో మాత్రం ఆ మేరకు సత్తాను చాటలేకపోయింది. కాంగ్రెసు 294 స్థానాల్లో కేవలం 157 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. గతంలో సాధించిన సీట్లలో 73 స్థానాలను కోల్పోయింది. తెలంగాణలో క్రాస్ ఓటింగ్ వల్ల, ఇతర స్థానిక కారణాల వల్ల శాసనసభలో కాంగ్రెసు బలం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. కానీ తెలంగాణ వాదం బలం వల్ల ఇక్కడ ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో పాటు డజను మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన మంత్రుల్లో ఎనమండుగురు తెలంగాణకు చెందినవారే. మంత్రులు షబ్బీర్ అలీ, టి. జీవన్ రెడ్డి, జి. చిన్నారెడ్డి, జి. వినోద్, ఫరీదుద్దీన్, ఎస్. చంద్రశేఖర్, జె రత్నాకర్ రావు, డిఎస్ రెడ్యా నాయక్ తెలంగాణకు చెందినవారు. వీరంతా తెలంగాణ వాదాన్ని తమ సొంత ప్రయోజనాలకు వాడుకుని వైయస్ రాజశేఖర రెడ్డికి వంత పాడినవారే. స్పీకర్ కె. సురేష్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ లోకసభ స్థానం పరిధిలోని పలువురు కాంగ్రెసు అభ్యర్థులు ఓటమి పాలు కాగా నిజామాబాద్ కాంగ్రెసు లోకసభ అభ్యర్థి మధుయాష్కీ మాత్రం విజయం సాధించారు. రాజశేఖర రెడ్డిని కూడా వ్యతిరేకిస్తూ తెలంగాణ వాణిని వినిపిస్తున్న నాయకుడు ఆయనొక్కరే. ఓటమి పాలైన ఆంధ్ర మంత్రులు పి. వెంకటేశ్వరరావు, ఎన్. రాజ్యలక్ష్మి, మండలి బుద్ధప్రసాద్. రాయలసీమకు చెందిన మంత్రుల్లో ఆర్ చెంగారెడ్డి ఒక్కరే ఓటమి చెందారు.
కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జె. వెంకటరావు వ్యతిరేకత వల్ల ఓడిపోయారు. వెంకటరావుకు శాసనసభ టికెట్ ఇవ్వకపోవడమే ఆమె ఓటమికి కారణం.
1989 ఎన్నికలతో పోల్చుకుంటే 2004 ఎన్నికల్లో కాంగ్రెసు బలం తగ్గినపోయినట్లే తెలుస్తుంది. ఈసారి ఆ బలం మరింత తగ్గిందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభలు తగ్గినట్లే భావించాలి. తెలంగాణలో హేమాహేమీల ఓటమి భవిష్యత్తులో వైయస్ రాజశేఖర రెడ్డికి గడ్డు పరిస్థితులను కల్పించే ప్రమాదం కూడా లేకపోలేదు.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications