'బై చిరంజీవ' అంటున్న రెబల్స్!

ఏమీ ఆశించకుండా అయన ఇంత చేసినా ఇప్పుడు ఆయన మాటకు పార్టీలో వీసమెత్తు విలువలేదు. పార్టీలో చిరంజీవి డమ్మీ అయిపోతున్నారని, లోఫర్లకు, డాఫర్లకు టికెట్లు ఇస్తున్నారని సమరం విమర్శిస్తున్నారు. తన వాగ్దాటితో ప్రజారాజ్యం బహిరంగ సభల్లో మహిళలను విశేషంగా ఆకట్టుకున్న పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కూడా ఆనందంగా లేదు. మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి కూడా టికెట్ల పంపిణీ వ్యవహారం హేతుబద్ధంగా లేదని విమర్శించారు. సీనియర్ నాయకుడు, మాజీ ఐఎఎస్ అధికారి కెఎస్ ఆర్ మూర్తి తనకు అమలాపురం లోక్ సభ సీటు రానందుకు అలిగికూర్చున్నారు. చిరంజీవిపై ఆశలు పెట్టుకుని ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ఆ పార్టీ వ్యవహారంపై ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. రాజమండ్రి టికెట్ ఇవ్వనందుకు ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ కూడా తిరుగుబాటు బావుటా లేపారు. ఆయన అనుచరులు నేడు రాజమండ్రి ప్రజారాజ్యం పార్టీ ఆఫీసుకు తాళాలు వేయడం ప్రరాపా తిరిగిబాట్లకు పరాకాష్ట.












Click it and Unblock the Notifications