జగన్ పై చంద్రబాబు గెలిచారా?

Chandra Babu Naidu
రైతు సమస్యలపై పోరాటంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైచేయి సాధించారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతు సమస్యలపై ఇద్దరు నేతలు పోటీ పడి దీక్షలు చేశారు. వైయస్ జగన్ విజయవాడ కృష్ణాతీరంలో 48 గంటల పాటు లక్ష్యదీక్ష చేయగా, చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేసి ఎనిమిదో రోజు విరమించారు. ఈ దీక్షల విషయంలో ఇరువురు నేతలు పోటీ పడ్డారు. చంద్రబాబుపై వైయస్ జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ఆయన దుయ్యబట్టారు. పైగా, ప్రభుత్వంతో కుమ్మక్కయి చంద్రబాబు దీక్ష సాగిస్తున్నారని, చంద్రబాబుది దొంగ దీక్ష అని జగన్ కు చెందిన సాక్షి మీడియా దుమ్మెత్తిపోసింది. చంద్రబాబుది నిజమైన దీక్ష కాదని చెప్పడానికి వైయస్ జగన్ వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. ఇది వైయస్ జగన్ కు అనుకూలంగా మారకపోగా, వ్యతిరేకతకు కారణమైంది. ప్రతిపక్షాల నాయకులందరూ సాక్షి మీడియాను తప్పు పట్టారు. లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో పాటు నాయకులందరూ జగన్ మీడియా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రకంగా అన్ని పార్టీలు ఒక్కటై, జగన్ ఒక్కడయ్యారు.

మొత్తంగా రైతు వ్యతిరేకి ముద్రను దీక్ష ద్వారా చంద్రబాబు పోగొట్టుకున్నారని తెలుగుదేశం వర్గాలు సంతోషిస్తున్నాయి. చంద్రబాబు చేత దీక్షను విరమింపజేయడానికి దేశంలోని జాతీయ నాయకులు తరలి రావడం వల్ల ప్రతిష్ట పెరిగిందని కూడా భావిస్తున్నాయి. జాతీయ మీడియా దృష్టిని కూడా చంద్రబాబు తన దీక్ష ద్వారా ఆకర్షించారని చెప్పవచ్చు. పైగా, వైయస్ జగన్ రాజకీయ బలప్రదర్సనకు మాత్రమే లక్ష్యదీక్ష చేపట్టారనే విషయం బాగా ప్రచారంలోకి వచ్చిందని, రైతుల కోసం చేయలేదని అందరూ అనుకుంటున్నారని, అందువల్ల చిత్తశుద్ధితో రైతుల కోసం దీక్ష చేసింది తమ నాయకుడనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని తెలుగుదేశం నాయకులు సంబరపడుతున్నారు. ఈ స్థితిలో భవిష్యత్తు కార్యాచరణ కోసం తెలుగుదేశం వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారు.

రైతు సమస్యలపై ఇదే విధమైన టెంపోను కొసాగించే ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులున్నారు. అందుకు గాను, రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీన రైతు గర్జన నిర్వహించనున్నట్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఇంకా తేదీ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ సభను గుంటూరులో నిర్వహించాలా, హైదరాబాదులోనా అనే విషయంపై ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను కూడా ఆకర్షించడానికి హైదరాబాదులోనే నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంమీద, వైయస్ జగన్ పై చంద్రబాబు పైచేయి సాధించారనే ఆనందం తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+