ఆంధ్ర సరుకుల బహిష్కరణ

కోదండరామ్ నియంతలా, హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ కోదండరామ్ పై గుర్రుమంటున్నారు. కోదండరామ్ ను అరెస్టు చేయాలని రాయపాటి సాంబశివ రావు డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా కోదండరామ్ పై నిప్పులు చెరిగారు. కోదండరామ్ పై విశ్వవిద్యాలయ చాన్సలర్ హోదాలో చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను కోరారు. ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో నడిపించేందుకు గాంధేయ మార్గాన్ని తెలంగాణ జెఎసి ఎంచుకోవడం కూడా సీమాంధ్ర నాయకులకు మింగుడు పడడం లేదు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సహా పలువురు సీమాంధ్ర నాయకులకు తెలంగాణలో వ్యాపారాలున్నాయి. పరిశ్రమలున్నాయి. చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్ ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిజాం షుగర్స్ ను ఒక సీమాంధ్ర నాయకుడు కొనుక్కుని గాయత్రి షుగర్స్ గా మార్చుకున్నారు. వారికి పరిశ్రమలుండడాన్ని, అవి ఉత్పత్తులు చేపట్టడాన్ని తెలంగాణ జెఎసి తప్పు పట్టడం లేదు. ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడానికి నిరసనగా సీమాంధ్ర ఉత్పత్తుల బహిష్కరణకు జెఎసి పిలుపు ఇచ్చింది. పోరాట మార్గాల్లో అది ఒకటి. రాజకీయంగా ఒత్తిడి పెంచడానికి జెఎసి ఆ మార్గాన్ని ఎంచుకుంది. తమ లక్ష్యసాధనకు శాంతియుత మార్గంలో ఏదో ఒక పోరాట రూపాన్ని ఎంచుకోక తప్పదు. అది చట్టపరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఉండాలని కోరుకుంటాం. అదే మార్గాన్ని తెలంగాణ జెఎసి అనుసరిస్తోంది. ఇందులో వ్యతిరేకించాల్సింది ఏమీ లేదని తెలంగాణ మేధావులు అంటున్నారు. సీమాంధ్ర రాజకీయ నాయకుల సరుకుల బహిష్కరణ అనేది కోదండరామ్ వ్యక్తిగత నిర్ణయం కూడా కాదు, పది జిల్లాల జెఎసి కన్వీనర్ల సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు.
తమ పట్టు వీడం, తమపై ఏ విధమైన ఒత్తిడి ఉండకూడదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటాం అని సీమాంధ్ర నాయకులు అంటే అదే విధమైన హేతుబద్దమైన వాదనో ఆలోచించాల్సి ఉంటుంది.