నేతాజీపై జయప్రద నిప్పులు

నేతాజీ నుంచి తాను అటువంటి ప్రకటన వస్తుందని తాను ఊహించలేదని, మహిళల పట్ల ములాయం సింగ్ పర్వర్టెడ్ వైఖరి బయట పడిందని ఆమె వ్యాఖ్యానించారు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో పాలు పంచుకుంటున్న మహిళలందరినీ ములాయం ఆవమానించారని ఆమె విమర్శించారు. ములాయం సింగ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని జయప్రద మహిళా కమిషన్ ను కోరారు. ములాయంను తాను తండ్రిలాగా గౌరవించానని, అయితే ములాయం తనను అవమానించారని ఆమె అన్నారు.
అమర్ సింగ్ ను బలపరిచినందుకు ములాయం సింగ్ జయప్రదను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఆమె ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల నాటికి ఆమె మరో గూటిని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆమె తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సైకిల్ ను దిగి ఆంధ్రప్రదేశ్ లోని సైకిల్ పై ఆయన ప్రయాణం చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె ఇక్కడి నుంచే అక్కడికి వెళ్లారు.












Click it and Unblock the Notifications