ఎన్టీఆర్ దేవుడా?

సినిమాల విషయానికి వస్తే, పౌరాణిక పాత్రల పోషణలో ఆయనకు సాటి వచ్చేవారు తక్కువ. ఎస్వీ రంగారావు వంటి ఒకరిద్దరు కనిపించినా ఎన్టీ రామారావు మాదిరిగా వెలిగినవారు లేరు. శ్రీకృష్ణుడంటే ఇలాగే ఉండేవాడు అనిపించేలా ఆ పాత్రకు రూపు కట్టారు. దాంతో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీ రామారావును తెలుగు ప్రజలు పూజించారు కూడా. గుడులు కూడా కట్టిన సందర్భాలున్నాయి. ఆయనకు విశేష జనాదరణ ఉంది. ఆ జనాదరణ మాత్రమే ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో విజయం సాధించలేదు. అప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న ఒక ఖాళీ ఆయనను ముందుకు నడిపించింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలోని కొత్త తరానికి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం లభించింది. పలుకుబడి, అంగ, అర్థ బలాలు లేని ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రధాన నాయకులుగా ఉన్న చాలా మంది ఎన్టీ రామారావు ద్వారా రాజకీయాల్లోకి వచ్చినవారే. అలాగే, ప్రజా సంక్షేమం కోసం ఆయన పలు పథకాలను ప్రవేశపెట్టారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అందరికీ తెలిసిందే. బిసిలు, ఎస్సీలు, ఎస్టీలకు పలు పథకాలను కూడా ఆయన అమలు చేశారు. ఈ విషయానికి వస్తే చాలా మంది రాజకీయ నాయకుల కన్నా ఎన్టీ రామారావు ఏదో మేరకు ప్రజల మేలు గురించి ఆలోచన ఎక్కువగా చేసినవారే.
కాగా, ఎన్టీ రామారావు ఆయన కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినవారు మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజలందరికీ చెందినవారు. ఎన్టీ రామారావు ఆశయాలకు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఏనాడో చెల్లు చీటి పాడింది. అందువల్ల ఎన్టీ రామారావు వారసత్వాన్ని చెప్పుకునే హక్కు ఆ పార్టీకి గానీ కుటుంబ సభ్యులకు గానీ లేదు. రాజకీయాల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఆయకు స్పష్టమైన అభిప్రాయాలు కూడా ఉండేవి.












Click it and Unblock the Notifications