జగన్ పై సోనియాకు అక్కసేనా?

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో నానా గందరగోళం ఏర్పడుతోంది. జగన్ వర్గం తన భాష్యం తాను చెబుతుండగా, జగన్ వ్యతిరేకులు తమ భాష్యం తాము చెబుతున్నారు. అసలు ఓదార్పు యాత్రను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అక్కసుతో అడ్డుకుంటున్నారని చిత్రీకరించడానికి జగన్ వర్గం నుంచి జరుగుతోంది. జగన్ వ్యతిరేకులు చెప్పే మాటలను సోనియా గుడ్డిగా నమ్ముతున్నారని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోంది. జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక ఆ విధంగానే వార్తా కథనాలను ప్రచురిస్తోంది. దీన్ని బట్టి జగన్ కు గానీ జగన్ వర్గానికి గానీ సోనియా తెలివి మీద, ఆమె విచక్షణ మీద, సమాచార సేకరణ మీద చిన్నచూపు ఉందనే భావించాల్సి ఉంటుంది. నిజానికి, సోనియాకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రపై కచ్చితమైన అభిప్రాయం ఉంది.

ఓదార్పు యాత్ర చేపట్టవద్దని సోనియా జగన్ కు ఏనాడూ చెప్పలేదు. అట్లని కొనసాగించాలనీ చెప్పలేదు. ఈ రెంటి మధ్య ఉన్న అంతరాన్ని అర్థం చేసుకోవడంలో జగన్ వర్గం విఫలమైందా, కావాలనే అర్థం కానట్లు నటిస్తుందా అనేది చెప్పలేం. కానీ విషయాలను సూటిగా, స్ఫష్టంగా చెప్పడానికి జగన్ వర్గం సిద్ధంగా లేదని అనుకోవాల్సి ఉంటుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని పార్టీ నేతగా చూడాలనేది, వైయస్ కేవలం జగన్ కో జగన్ కుటంబానికో సంబంధించినవాడిగా చూడకూడదనేది సోనియా అభిమతం. జగన్ సోనియా అభిమతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జగన్ వైయస్ ను మహానేతగా చూపెడుతూ పార్టీకి ఆయనను దక్కకుండా చేసి, తన సొంతం చేసుకుని సొంత రాజకీయ లబ్దికి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఆమె అభిప్రాయమని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఓదార్పు యాత్రను నిరాడంబరంగా, బాధితులను అందరినీ జిల్లా కేంద్రాలకు రప్పించి సాయం అందించాలని జగన్ కు సూచించారు. అంతేకాకుండా ఆ ఓదార్పు యాత్రను పార్టీ కార్యక్రమంగా చేపట్టాలని కూడా సూచించారు. ఈ విషయం కేంద్ర మంత్రి పురంధేశ్వరి మాటల ద్వారా గురువారం పూర్తిగా స్పష్టమైంది. బాధితులను ఒక్క చోటికి పిలిపించి సాయం అందించాలని సోనియా సూచించినట్లు జగన్ చెప్పారు గానీ దాన్ని పార్టీ కార్యక్రమంగా చేపట్టాలని సోనియా చెప్పినట్లు ఆయన వెల్లడించలేదు. ఇది జగన్ వర్గంలో కలతలకు కారణమయ్యే అవకాశం ఉంది. కొంత చెప్పి కొంత దాచిపెట్టడంలో జగన్ ఆంతర్యమేమిటనేది ఇప్పుడు ఆలోచన మొదలైంది. వైయస్ ను పార్టీ నేతగా చూస్తూ ఆయన కీర్తి పార్టికి దక్కాలని పార్టీ నాయకులంతా భావిస్తున్నారు. కానీ జగన్ ఒక్కడే దాన్ని సొంతం చేసుకుని రాజకీయంగా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారనేది అర్థమవుతున్న విషయం.

తన వ్యూహానికి ఆటంకాలు ఏర్పడుతుండడంతో జగన్ అసహనానికి గురవుతున్నారు. పార్టీ శాసనసభ్యులను ఆయన ఆత్మాభిమానం లేని ప్రజాప్రతినిధులుగా పరిగణిస్తున్నారు. ప్రకాశం జిల్లా శాసనసభ్యుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సాక్షి దినపత్రికలో కూడా శాసనసభ్యులను వ్యక్తిత్వం లేనివారిగా చిత్రీకరించారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు డబ్బులు పెట్టి ఫ్లయిట్ టికెట్లు కొని వారిని బలవంతంగా ఢిల్లీ తీసుకెళ్లారని సాక్షి దినపత్రిక అభియోగం మోపుతోంది. జగన్ కు ఎదుటివారి పట్ల ఎంత చులకన భావం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. ఏమైనా, జగన్ వ్యూహంలో పెద్ద లోపమే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+