కెసిఆర్ పై రాములమ్మ కినుక

Vijayashanthi
ఒక్కసారి మనసు విరిగిపోతే మళ్లీ అతుక్కోదని అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు, పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి వ్యవహారం ఆ విషయాన్ని తెలియజేస్తోంది. పార్టీకి చాలా కాలం దూరమైన విజయశాంతి మళ్లీ పార్టీలోకి వచ్చారు. కెసిఆర్ కూడా ఆమెను ఆహ్వానించారు. ఆమెకు తగిన స్థానం కల్పిస్తున్నట్లు బయటకు కనిపిస్తున్నారు. అయితే వారి మధ్య విభేదాలు తొలగలేదని అంటున్నారు. అందుకు పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఉదహరణగా చెబుతున్నారు. వేదిక మీద పరోక్షంగా పరస్పరం విమర్శలు కూడా చేసుకున్నారు. విజయశాంతి పట్ల కెసిఆర్ ఇంకా పూర్తిగా నమ్మడం లేదని, ఆమెను దూరంగా పెట్టే ప్రయత్నమే చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఆవిర్భావ సభలో విజయశాంతి అన్నారు. పొత్తులతో చిత్తయ్యామని కూడా ఆమె విమర్శించారు. పరోక్షంగా ఆమె కెసిఆర్ వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. దానికి కెసిఆర్ కూడా అదే రీతిలో సమాధానం ఇచ్చారు. కాడి మోసే వాడికి బరువు తెలుస్తుందని ఆయన అన్నారు. ఇలా ఇరువురు పరస్పరం విమర్శలు చేసుకోవడం పార్టీ శ్రేణులకు పెద్దగా నచ్చినట్లు లేదు. పార్టీ ఆవిర్భావ సభ వేదికపై విజయశాంతికి స్థానం కల్పించినప్పటికీ ఆమెకు మాట్లాడేందుకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. తీర్మానాలు ప్రతిపాదించే అవకాశం కూడా ఇవ్వలేదు. విజయశాంతి మాట్లాడడానికి సిద్ధమైనప్పుడు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడాలని కెసిఆర్ సూచించారు. ఈ రకంగా ఆమెకు తగిన ప్రాధాన్యం లభించకుండా చేశారు.

అదే సమయంలో రోషం హీరో బాలును వేదికపైకి ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టారు. సభకు ముందు మంద కృష్ణ మాదిగ విజయశాంతిని కలుసుకోవడంపై తెరాసలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కెసిఆర్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ ను మందకృష్ణ మాదిగ తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. తనపై కెసిఆర్ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. అటువంటి మందకృష్ణ మాదిగను విజయశాంతి కలుసుకోవడం కెసిఆర్ కు నచ్చడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+