జగన్ 'సాక్షి' వ్యూహం?

పక్కా వ్యూహం ప్రకారమే సాక్షిలో జగన్ ఆ వార్తాకథనాన్ని ప్రచురింపజేశారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతిలో వైయస్ జగన్ ప్రథమ వర్ధంతి సభను జరుపుతోంది. అదే సమయంలో ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ఆ రోజు వైయస్ వర్ధంతి కార్యక్రమాలను తలపెట్టారు. ఒక రకంగా జగన్ వర్గం తలపెట్టిన సంస్మరణ సభకు ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ విరుగుడుగా కార్యక్రమాలు చేపట్టిందని భావించవచ్చు. వైయస్ పార్టీకి చెందిన వాడని, పార్టీ లేకుండా వైయస్ ఎదుగుదల లేదని చెప్పడానికి కాంగ్రెసు నాయకత్వం ప్రయత్నిస్తుండగా, పార్టీకి దక్కకుండా తాను మాత్రమే సొంతం చేసుకోవడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ పెట్టే ఆలోచన వల్లనే జగన్ వైయస్సార్ ను కాంగ్రెసుకు కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగానే సాక్షి దినపత్రికలో ఆ వార్తాకథనం మళ్లీ వచ్చిందని భావిస్తున్నారు.
వైయస్సార్ మరణానికి కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనక తమ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వ పెద్దలే ఉన్నారని చెప్పడానికి వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నట్లు ఆ వార్తాకథనాన్ని అర్థం చేసుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలు కూడా ప్రభుత్వం చెప్పుచేతల్లోనే పనిచేస్తాయని, అందువల్లనే దర్యాప్తు సరిగా జరగలేదని చెప్పడానికి ప్రయత్నించినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఓదార్పు యాత్రలో కాంగ్రెసు పార్టీ ప్రస్తావన గానీ సోనియా ప్రస్తావన గానీ తేకపోవడం వెనక గల కారణాన్ని అటుంచితే, వైయస్ మరణంపై జరిగిన దర్యాప్తు తీరును తప్పు పట్టడం సోనియా, మన్మోహన్ ల నాయకత్వంలోని పార్టీ, ప్రభుత్వం ఉన్నాయని జగన్ నిందించడానికి సిద్ధపడ్డారని భావించాల్సి ఉంటుంది. ఇలా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని, పార్టీ అధిష్టానాన్ని తప్పు పడుతూ ముందుకు వెళ్లడం జగన్ వ్యూహంలో భాగమని, అది సొంత పార్టీ పెట్టే దిశగానే ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications