వైయస్ జగనే అసలు సమస్య

కాగా, వి హనుమంతరావు, పాల్వాయి గోవర్దన్ రెడ్డి వంటి వైయస్ జగన్ ప్రత్యర్థులు కూడా వైయస్ జగన్ ఓదార్పు యాత్రపైన, ఆయన అధికార తాపత్రయం మీద మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య నాయకత్వాన్ని బలపరచడమే పరమావధిగా వారు వ్యవహరిస్తున్నారు. వీరు అధిష్టానం ఎజెండాకు అనుగుణంగా మాట్లాడుతున్నారనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. వైయస్ జగన్ ను ఆధిపత్య ధోరణిని దెబ్బ తీసి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలనే పార్టీ అధిష్టానం వ్యూహంలో భాగంగానే వారు వ్యవహరిస్తూ వస్తున్నారు. వారికి కూడా ప్రజా సమస్యల ఊసు అవసరం లేకుండా పోయింది.
కాంగ్రెసు పార్టీయే అధికార, ప్రతిపక్ష పాత్రలను పోషిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆత్మరక్షణలో పడ్డారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని అవినీతి, అక్రమాలను ప్రధాన ఎజెండా చేసుకుని ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి, చంద్రబాబు మాటలనే కాంగ్రెసులోని జగన్ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. అందువల్ల చంద్రబాబు చేసే పోరాటానికి ప్రత్యేకత లేకుండా పోతోంది. ఆ పోరాటం వల్ల ఆయనకు ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం కూడా లేకుండా పోయింది. వైయస్ జగన్ వర్గం నుంచి, ఆయన వ్యతిరేక వర్గం నుంచి కూడా చంద్రబాబు విమర్శలను ఎదుర్కుంటున్నారు. మరో వైపు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నుంచి కూడా ఆయన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. చంద్రబాబుకు సంబంధించి ఇదో విచిత్రమైన పరిస్థితి. ఎవరు ఏం చేసినా వైయస్ జగన్ కేంద్ర బిందువుగా మారిపోయారు. అది ఆయనకు మేలు చేస్తుందా, నష్టం చేస్తుందా అనేది ఇప్పుడు అంచనా వేయలేం.












Click it and Unblock the Notifications