జగన్ కొత్త ఎత్తుగడ

YS Jagan
ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని అస్థిరంపాలు చేసేందుకు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. రోశయ్యను క్షణం నిద్ర పోనివ్వకుండా చేయాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఫీజు రీయంబర్స్ మెంటు బకాయిల వ్యవహారాన్ని జగన్ తెర మీదికి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఫీజుల రీయంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు వెంటనే జరగాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘం నేత ఆర్. కృష్ణయ్య ఆమరణ నిరాహార దీక్ష చేయడం వెనక ప్రతిపక్షాల నాయకుల కన్నా జగన్ పాత్రే ఎక్కువనే ప్రచారం జరుగుతోంది. ఫీజుల రీయంబర్స్ మెంటు బాకీలపై జగన్ కు చెందిన సాక్షి దినపత్రికలో వార్తాకథనాలు జోరుగా ప్రచురితమయ్యాయి. వైయస్ రాజశేఖర రెడ్డిని మహానేతగా పేర్కొంటూ సాక్షిలో ఆయన హయాంలో ఏ కష్టాలు లేకుండా ఎలా ఫీజుల చెల్లింపు జరిగిందో సాక్షి దినపత్రిక వివరిస్తూ వార్తాకథనాలు ప్రచురించింది.

ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి ముందు సాక్షి టీవీ చానెల్ లో ఆర్. కృష్ణయ్యతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమకు అనుకూలంగా కృష్ణయ్యను సాక్షి టీవీ చానెల్ ప్రతినిధి ప్రశ్నలు వేయడం ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. వైయస్ హయాంలో కూడా ఫీజుల బాకీలున్నాయని, అయితే, వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ పోయారని, ఇప్పుడు చెల్లింపులు ఆపేయడంతో బాకీలు 2 వేల కోట్ల రూపాయల దాకా పేరుకుపోయాయని కృష్ణయ్య ఈ కార్యక్రమంలో చెప్పారు. దీన్ని బట్టి వైయస్ హయాంలో బాకీలే లేవనడం సరి కాదనేది తేలిపోయింది. అయినా సాక్షి టీవీ చానెల్ గానీ పత్రిక గానీ బాకీలే లేనట్లుగా ప్రచారం సాగిస్తున్నాయి.

ఫీజుల రీయంబర్స్ మెంటు వ్యవహారంలో విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉండడం, కృష్ణయ్య దీక్ష చేస్తే విద్యార్థుల నుంచి ఇతోధిక మద్దతు లభించడం వంటి కారణాల వల్ల తప్పకుండా రోశయ్య ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందనేది జగన్ వ్యూహమని చెబుతున్నారు. ఆయన వ్యూహం ఏదో మేరకు ఫలించినట్లేనని చెప్పవచ్చు. కృష్ణయ్యది న్యాయమైన డిమాండ్ కావడంతో ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. ఆర్. కృష్ణయ్య డిమాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు తగిన నైతిక బలం ఎవరికీ లేదు. ఈ రకంగా జగన్ రోశయ్యను ఇరకాటంలో పెట్టినట్లేనని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+