వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు రెండు కళ్ల కుంపటి, నేతల మధ్య తిట్ల పురాణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలంగాణపై అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా పరిణమించింది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత తమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. గతంలో రేవంత్ రెడ్డికి, పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు తీసుకున్న క్లాస్ ఏమీ ఫలితం ఇవ్వడం లేదు. ఇంతకు ముందు తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి, సీమాంధ్ర నేత పయ్యావుల కేశవ్‌కి మధ్య తిట్ల పురాణం చోటు చేసుకుంటే, తాజాగా తెలంగాణ శానసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు, పయ్యావుల కేశవ్‌కు మధ్య మాటల యుద్ధం నడిచింది.

పయ్యావుల కేశవ్‌పై తెలుగుదేశం తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కేశవ్ ఉచిత సలహాలు తమకు అవసరం లేదని మాజీ మంత్రి, సీనియర్ నేత కడియ శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో పయ్యావుల కేశవ్ ఒక చీడపురుగులా మిగిలిపోవద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు పలికారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని చేసుకోవడంలో తప్పులేదని, అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న తమపై వారు పోరాటం చేయడం ఎంత వరకు సబబని ఎర్రబెల్లి ప్రశ్నించారు. తెలంగాణ కోసం తెలంగాణ తెలుగుదేశం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. తమ భవిష్యత్ ప్రణాళికను ఈనెల 31వ తేదీన ఇందిరాపార్కు వద్ద జరిగే సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఆగస్టు ఒకటో తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

కాగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర కోసం తిరుపతిలో మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రాంత నేతలు రాజీనామాలతో ఏమీ సాధించలేరని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. వీరి రాజీనామాలకు బెదిరేది ఎవరని ఆయన ప్రశ్నించారు. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం రాదన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి తెలంగాణ ప్రాంత రాజీనామాలు సరిపోవన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు రాజీనామా చేస్తే మాత్రం కేంద్ర తక్షణం స్పందించక తప్పదన్నారు. లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ ఉండదని పయ్యావుల జోస్యం చెప్పారు. ఇదే విషయం గత 2009 డిసెంబరులో రుజువైందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముక్కలు కానివ్వమన్నారు. ఒకవేళ అలాంటి చర్యకు కేంద్రం పూనుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పయ్యావుల హెచ్చరించారు.

English summary
TDP president N Chandrabbu Naidu is trouble, as Seemandhra and Telangana are criticising each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X