చిరంజీవి చిత్రం డౌటే?

తమ అభిమాన హీరో చిత్రాన్ని మళ్లీ చూడవచ్చుననుకొని ఆనందపడ్డారు. కానీ ఇటు తెలంగాణ ఉద్యమం, అటు జగన్ సమస్య కారణంగా రాష్ట్రంలో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో చిరంజీవికి ఫుల్‌గా రాజకీయాలకే పరిమితం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ కారణంగానే విపక్ష నాయకులు సమస్యలపై రోడ్లకెక్కుతున్నారు. చిరంజీవికి కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సినిమా చేయటం చిరంజీవికి కష్టమనే పలువురు అంటున్నారు. దీంతో ఈ సంవత్సరం వస్తుందనుకున్న ఆనందోత్సాహలతో ఉన్న చిరంజీవి అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచేదే. అయితే అనుకోని విధంగా ఎన్నికలు వచ్చి ప్రజారాజ్యం ఏమాత్రం పుంజుకున్నా చిరంజీవి అభిమానులకు అంతకన్నా సంతోషం ఉండదు. ఎన్టీఆర్ ఆదర్శంగా చిరంజీవి కూడా ఇటు రాజకీయాలు, అటు సినిమాలకు రెడి ఆయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ పలు చిత్రాల్లో నటించారు.
చిరంజీవి కొత్త చిత్రం వివి వినాయక్‌తో గానీ బోయపాటి శ్రీనుతోగాని ఉంటుందని మొదట వార్తలు వచ్చాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్‌తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలే నిజమైతే తెలుగు సినిమా చరిత్రలో ఇదే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. శంకర్ ఎంత లేదన్నా సుమారు 5 నుండి పదికోట్ల వరకు డిమాండ్ చేస్తారు. చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ కూడా చిరంజీవి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలని ఉబలాటపడుతున్నాడు. దీంతో చిరంజీవి, శంకర్, రాంచరణ్ తేజలు కలిస్తే అది భారీ బడ్జెట్‌తోనే రూపుదిద్దుకుంటుంది. అయితే త్రీ ఇడియట్స్ అనువాద చిత్ర బిజీలో ఉన్న శంకర్ కోసం చిరంజీవి వెయిట్ చేసిన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
చిరంజీవి రాజకీయాలలోకి రాకముందు ఆయన కోసం పరుచూరి బ్రదర్స్ అధినాయకుడు అనే చిత్రాన్ని తయారు చేసి పెట్టారు. అనూహ్యంగా చిరు రాజకీయాల్లోకి రావడంతో అది కాస్త మరుగున పడింది. అయితే అదే కథతో జగపతిబాబు హీరోగా అధినేతగా తెరకెక్కించారు. చిరంజీవి రాబోయే చిత్రం ఠాగూర్ తరహా ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications