వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం సొంత టీం: జగన్‌కు చెక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తన సొంత జట్టుపైన దృష్టి సారిస్తున్నట్లుగా కనిపిస్తోంది. శాసనసభ్యుల కోటా కింద జరిగే శాసనమండలి ఎన్నికలలో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచిన అధికార పార్టీ, ఆ తర్వాత స్థానిక సంస్థ కోటాలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యింది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి తన సొంత టీంను తయారు చేసుకునే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ బలోపేతంగా ఉండాలంటే సొంత టీంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను పలువురు శాసనసభ్యులు, మంత్రులు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ పలువురు ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రధానంగా కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలంటే కిరణ్ సొంత టీంపై దృష్టి సారించాల్సిందిగా పలువురు సూచించినట్లుగా తెలుస్తోంది. కడప పార్లమెంటరీ పరిధిలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలవారీగా బలంగా ఉన్న నేతలకు ఉప ఎన్నికల బాధ్యతలు ఇచ్చారని, ఇదే దారిలో మనం నడిస్తేనే బావుంటుందని కడప జిల్లాకు చెందిన శాసనసభ్యులు సూచించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కూడా చర్యలకు వారు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు బాహాటంగా జగన్‌కు మద్దతు తెలుపుతున్నప్పటికీ చర్యలు తీసుకోకుండే భవిష్యత్తులో జిల్లాలో పార్టీకి నష్టం చేసే విధంగా ఉంటుందని వారు భావిస్తున్నట్టుగా సమాచారం.

పార్టీ వ్యతిరేకులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కడప ఎన్నికల్లో గెలవాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదని పలువురు సూచించినట్లుగా తెలుస్తోంది. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే కడప పార్లమెంటు పరిధిలో ఉన్న పలు శాసనసభ నియోజకవర్గాల్లో జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో బాధ్యతలు తీసుకునేందుకు మిగతా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ వర్గంపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పష్టంగా చెబుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే వారిపై పార్టీ చర్యలు తీసుకోవాల్సిందేనని బొత్స కూడా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకొని ఆ స్థానంలో తన టీంను ఏర్పర్చుకునే దిశలో సిఎం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

English summary
CM Kiran Kumar Reddy is trying to make his own team. After defeat of MLC election he is thinking about it. some of MLAs also suggested CM Kiran to own team. Kadapa district MLA Veera Siva Reddy urged to CM to take action on Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X