తెలంగాణపై నిర్ణయానికి సిడబ్ల్యుసి భేటీ

నవంబర్ మొదటి వారంలో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయంతో ముందుకు వస్తుందని అంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు నెలలు దాటవేయడాన్ని కాంగ్రెసు నాయకులు ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. ఆ పద్ధతినే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నారని అంటున్నారు. అయితే, తెలంగాణ సమస్య తీవ్రతను మాత్రం కాంగ్రెసు అధిష్టానం గుర్తించింది. ఆ సమస్యను దాటడం ఎలా అనేది ఇప్పుడు కాంగ్రెసు అధిష్టానం ముందున్న విషయం. దానిపైనే కసరత్తు జరుగుతోంది.
ఓ వైపు కాంగ్రెసు అధిష్టానం చర్చల పేరుతో ఢిల్లీలో కాలయాపన చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన వివిధ సంఘాల్లో చీలికలు తేవడానికి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఇటీవల ఆర్టీసి కార్మిక సంఘంలో చీలిక తేవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల్లోనూ, టీచర్లలోనూ చీలిక తేవడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. సకల జనుల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విరమింపజేయగలిగితే తెలంగాణపై మరింత కాలయాపన చేయడానికి వీలవుతుందనే కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోంది. దీనికోసమే రోజుకు రోజుకు తెలంగాణపై నిర్ణయాన్ని చర్చల పేరుతో వాయిదా వేస్తూ వస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications