స్టీరింగ్‌లో ఎంపీలు వర్సెస్ మంత్రులు

కమిటీ సమావేశమైనప్పుడు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. కేవలం ఎంపీల నుండే ఎక్కువ స్పందన కనిపిస్తోంది. సమావేశాలను ప్రజాస్వామికంగా నిర్వహించట్లేదని, ముందే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని వాటిని స్టీరింగ్ కమిటీ తీర్మానాలుగా చెబుతున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలపై ఆరోపిస్తున్నారట. తెలంగాణ కోసం రాజీనామాలు మినహా మరేమీ లేదన్నట్లు ఎంపీలు మాట్లాడుతున్నారని ఇది సరికాదని ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని మంత్రులు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎంపీలు మాత్రం రాజీనామాలే డిమాండ్ చేయడం గమనార్హం.
ప్రధానం ఈ అంశంపైనే నేతల మధ్య పొసగనట్లుగా కనిపిస్తోంది. స్టీరింగ్ కమిటీ సమావేశమై అందరి అభిప్రాయాలను సేకరించి మెజారిటీ నిర్ణయాన్ని అమలు చేయాలని, అలా కాకుండా ఏదో ఒక నిర్ణయం తీసేసుకుని దాన్ని అందరిపైనా రుద్దాలనుకోవడం సరికాదని మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే మంత్రుల మార్గదర్శనంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని, పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణ కోసం పోరాడదామని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తాము చేస్తున్న కృషి కారణంగా బాన్సువాడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి గౌరవప్రదమైన ఓట్లు దక్కాయని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications