వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే: జగన్‌ది పవర్, కెసిఆర్‌ది ప్రతిపక్షం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ చిత్తుగా ఓడుతుందనే విషయంపై ఎన్టీవీ-నీల్సన్ డాట్ ఆర్గ్ సంస్థతో కలిపి ఓ సర్వేను చేసింది. ఆ సర్వేలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తెలంగాణలో ప్రధానంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీగా నిలుస్తాయని, ఇక జాతీయ కాంగ్రెస్ పార్టీ, 28ఏళ్ల ఘనత కలిగిన తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోతాయని, ఇక అశేష అభిమాన గణం ఉన్న మెగాస్టార్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కనుమరుగవుతురాని చెప్పింది. అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రమే అని చెప్పింది. పీఆర్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరతను ఏర్పర్చుకున్న దృష్ట్యా ప్రస్తుతానికి ఇవి అంకెలకే పరిమితం అనుకోవచ్చు. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనానికి ముందు చేసిన సర్వే అని చెప్పింది. రాష్ట్రంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ఇమేజ్ దారుణంగా తగ్గిపోయినట్లు ఈ సర్వేలో బయటపడింది. కాగా ఈ సర్వే తెలంగాణ ఉద్యమం ఉధృతం, వైఎస్ మరణం జగన్‌పట్ల సానుభూతి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చి రెండు, మూడు నెలలే అయిన భావోద్వేగాల మధ్య చేసిన సర్వే మాత్రమే.

ప్రభుత్వం ఇప్పుడు పడిపోయి ఎన్నికలు వస్తే జగన్ పార్టీ 139-156, టీఆర్ఎస్ 70-74, కాంగ్రెస్ 28-33, టిడిపి 22-37, కమ్యూనిస్టులు 1-2, ఇతరులు 3-6 వరకు సీట్లు గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. ఇక ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు 12-14, కోస్తాంధ్రలో 12-14, రాయలసీమలో 3-5, తెలంగాణలో టిడిపికి 15-17, కోస్తాంధ్రలో 14-16, రాయలసీమలో 3-5, ఇక టిఆర్ఎస్‌కు తెలంగాణలో 70-74, పీఆర్పీకి తెలంగాణలో, రాయలసీమలో ఏమీ రాకున్నాకోస్తాంధ్రలో 2-4 సీట్లు, జగన్ పార్టీ కోస్తాంధ్రలో 87-94, తెలంగాణలో 12-14, రాయలసీమలో 41-45 గెలుస్తారని సర్వేలో తేలింది. ఓట్ల శాతానికి వస్తే కాంగ్రెస్‌కు 16, టిడిపికి 18, టిఆర్ఎస్‌కు 20, పీఆర్పీకి 5, జగన్‌కు 35 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. పార్టీ అధినేతల వ్యక్తిగత ఇమేజ్ చూస్తే.. టిడిపి అధినేత చంద్రబాబుకు ఈమేజ్ పెరిగిందని 27శాతం మంది అభిప్రాయపడితే, 40 మంది అలాగే ఉందని, 32 శాతం మంది పెరగలేదని చెప్పారు.

చిరు ఇమేజ్ పెరిగిందని 6, అలాగే ఉందని 40, పెరగలేదని 52శాతం, కెసిఆర్ ఇమేజ్ పెరిగిందని 40, అలాగే ఉందని 21, పెరగలేదని 29శాతం మంది, జగన్ ఇమేజ్ పెరిగిందని 61, అలాగే ఉందని 24, పెరగలేదని 11శాతం, సోనియా, రాహుల్ ఇమేజ్ పెరిగిందని 7శాతం మంది సర్వేలో చెప్పారు. ఇక 2014 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నరనే దానికి 35శాతం మంది జగన్, 19శాతం చంద్రబాబు, 18శాతం కేసిఆర్, 15శాతం కిరణ్‌కుమార్ రెడ్డి, 5శాతం చిరంజీవిని కోరుకుంటున్నారు. ప్రాంతాల వారిగా చెప్పాలంటే రాయలసీమలో జగన్‌ను 66శాతం, తెలంగాణలో 12శాతం, ఆంధ్రలో 48శాతం సిఎంగా కోరుకుంటున్నారు. చంద్రబాబును సీమలో 20, తెలంగాణలో 14, ఆంధ్రలో 23, కిరణ్‌ను సీమలో 9, తెలంగాణలో 16, ఆంధ్రలో 17, చిరును సీమలో 4, తెలంగాణలో 1, ఆంధ్రలో 11శాతం కాగా, ఇక కెసిఆర్‌ను తెలంగాణలో 43శాతం మంది సిఎంగా కోరుకుంటున్నారు.

కిరణ్ ప్రభుత్వం పనితీరు విషయానికి వస్తే కాంగ్రెస్ బాగానే పని చేస్తుందని 11, ఫరవాలేదని 21, బాగాలేదని 71, ప్రతిపక్షంగా టిడిపి బాగానే ఉందని 16, ఫరవాలేదని 19, బాగాలేదని 64, పీఆర్పీ బాగుందని 5, ఫరవాలేదని 11, బాగాలేదని 83శాతం మంది తేల్చి చెప్పారు. ఇక ప్రభుత్వం నిలబడుతుందా, పడిపోతుందా అంటే 52శాతం మంది పడిపోతుందని, 30శాతం మంది లేదని, 18శాతం మంది చెప్పలేమన్నారు. కాగా రోశయ్య ప్రభుత్వం ఉన్న 2010లో 71శాతం మంది ప్రభుత్వ ఉంటుందని భావించగా ఇప్పుడు మాత్రం 30 మందికి పడిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని 80శాతం మంది చెప్పారు. కాంగ్రెస్ ఇంతగా బలహీన పడటానికి కారణం జగన్ బయటకు వెళ్లిపోవడమే అని 34శాతం మంది, బలమైన నాయకుడు లేకపోవడమే అని 32శాతం మంది, నేతల తీరు అని 10శాతం, సోనియాగాంధీ వ్యవహార శైలి అని 8శాతం మంది సర్వేలో తేల్చి చెప్పారు.

English summary
35 percent of people seems Ex MP YS Jagan as future CM in NTV-neilson.org survey. Jagan Party will get 139-156 
 
 seats if election will come at present. TRS will emerge as main opposition party. TDP and Congress may loss many 
 
 seats and PRP will disappear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X