గద్దర్‌ను మావోయిస్టులు సస్పెండ్ చేశారా?

Gaddar
ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్‌ను మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు తమకు చెప్పినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. రాష్ట్రంలోని మావోయిస్టు ఉద్యమానికి సాంస్కృతిక సారథిగా పనిచేస్తున్న గద్దర్‌ను సస్పెండ్ చేస్తూ సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ లేఖను విడుదల చేసినట్లు ఆ పత్రిక రాసింది. పలు సాంస్కృతిక సంఘాలకు సారథ్యం వహించిన గద్దర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజాఫ్రంట్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రజాతంత్ర రాజకీయ శక్తి కావాలని ఇటీవల గద్దర్ ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. గద్దర్ వ్యాఖ్యలు విప్లవోద్యమంలో అయోమయానికి కారణమవుతున్నాయని, దాంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపిందని ఓ పోలీసు అధికారి తమతో చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. గద్దర్‌కు వ్యతిరేకంగా మావోయిస్టు మేధావులు, సానుభూతిపరులు పార్టీకి లేఖలు రాసినట్లు ఆ పత్రిక తన వార్తాకథనంలో తెలిపింది.

తనకు ఏ విధమైన సమాచారం లేదని, సమాచారం అందిన తర్వాత మాట్లాడుతానని, సమస్య తనకూ ప్రజలకూ పార్టీకీ మధ్య మాత్రమేనని గద్దర్ తమతో అన్నట్లు ఆ పత్రిక రాసింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఉద్యమం కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని ఆయన అన్నట్లు పత్రిక రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+