కిరణ్ ప్రభుత్వం గట్టెక్కినట్లేనా?

ఇందులో నాగం, ప్రసన్న కుమార్ రెడ్డి, శోభా నాగి రెడ్డి ఇలా మూడు నాలుగు నియోజకవర్గాలు మాత్రమే విపక్షాలవి. మిగిలిన సుమారు ఇరవై నియోజకవర్గాలు కాంగ్రెసు పార్టీ గెలిచినవే. ఎంఐఎం(7), పిఆర్పీ(17) మందిని మినాహాయిస్తే ప్రస్తుతం కాంగ్రెసు బలం 136 మాత్రమే. ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే 294 సభ్యులలో ఉండాల్సిన బలం 147. అయితే పిఆర్పీ విలీనమైనప్పటికీ ఆ ప్రక్రియ అసెంబ్లీలో ఇంకా సంపూర్ణం కాలేదు. అంతేకాకుండా ఇప్పటికే అదును చూసి అలకపాన్పు ఎక్కిన చిరంజీవి భవిష్యత్తులో కూడా కాంగ్రెసును ఇరకాటంలో పెట్టే అవకాశాలను కొట్టి పారేయలేం. మరోవైపు జగన్ వర్గం పీఆర్పీ ఎమ్మెల్యేలకు, టిఆర్ఎస్ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులకు వల వేస్తోంది.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెసు ఖచ్చితంగా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆదుకునే పేరుతో పిఆర్పీ, ఎంఐఎం బెదిరింపులకు కిరణ్ ప్రభుత్వం లొంగవలసి ఉంటుంది. కానీ తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా తెలంగాణ ప్రాంతంలో, జగన్ పార్టీని చీల్చడంతో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు నష్ట పోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. మరి జగన్, టిడిపి, టిఆర్ఎస్‌ను ఎదుర్కొని తమ బలాన్ని కాంగ్రెసు ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications