కెసిఆర్‌కు చెక్, జగన్‌తో నాగం

తెలుగుదేశం పార్టీ నేతలలో కూడా ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు కెసిఆర్ వన్ మ్యాన్ షో పాత్ర పోషిస్తున్నారు. అలాంటి కెసిఆర్‌కు చెక్ చెప్పడానికి జగన్ వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషింపజేసి తద్వారా తమ పార్టీని తెలంగాణలో నిలబెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా వారు నాగంను తెరపైకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నాగం వెనుక జగన్, జైపాల్ రెడ్డి వంటి నాయకులు ఉన్నారని బాహాటంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో నాగంను తెరపైకి తేవడం ద్వారా ఇటు కేసిఆర్‌కు చెక్ చెప్పడంతో పాటు తెలుగుదేశం పార్టీని బలహీన పర్చ వచ్చుననేది జగన్ వర్గం వ్యూహంగా తెలుస్తోంది. ఉప ఎన్నికలకు ముందు నాగం జనార్ధన్ రెడ్డి జగన్‌ను పొగడటం కూడా అనుమానాలకు తావిస్తోంది. నాగం టిడిపిలో ఉంటూనే పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నుండి బయటకు వెళ్లకుండా తెలంగాణపై పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నించడం ద్వారా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చునని, ఆ తర్వాత కొన్నాళ్లకు జగన్ పంచకు చేరవచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ వ్యూహం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇటు టిడిపి బొక్క బోర్లా పడటం, అటు కేసిఅర్‌కు చెక్ చెప్పడం జరుగుతుంది. నాగం వెనుక జగన్‌తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. జగన్, జైపాల్ రెడ్డిల సూచనల మేరకే నాగం జనార్ధన్ రెడ్డి ఇటు పార్టీని ఇబ్బందులకు గురి చేయడంతో పాటు, అటు కేసిఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే వీరిద్దరిని టార్గెట్ చేసుకున్న నాగం జగన్ పార్టీ వైఖరిని ప్రశ్నించక పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నాగం, జగన్, జైపాల్ రెడ్డి వ్యూహాన్ని గమనించిన కెసిఆర్ తెలంగాణ జెఏసి దరిదాపుల్లోకి నాగంను రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications