స్థానిక ఎన్నికలే జగన్ టార్గెట్

నిజానికి, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేయాలని ఆయన అనుకున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఆ కమిటీలను వేసే ఆలోచనకు స్వస్థి చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో కింది స్థాయి నాయకులు ముందుకు వస్తారు కాబట్టి పార్టీని పునాది స్థాయిలో పటిష్టపరుచుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నాడి స్పష్టంగా వ్యక్తమయ్యే అవకాశాలుంటాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాల పరంపరను మూట గట్టుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. తద్వారా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు గట్టి షాక్ ఇవ్వాలనేది ఆయన అభిమతమని చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో తన బలం వ్యక్తమైతే రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పెను కదలిక వస్తుందని అనుకుంటున్నారు. తనతో నడవడానికి సందేహిస్తున్న నాయకులు తన వైపు రావడానికి మార్గం సులభమవుతుందని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తెలంగాణలో కూడా తనకు గల జనాదరణకు సంబంధించిన చిత్రం లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, పక్కా ప్రణాళికతో ఆయన ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications