బంగారం ధరల్లో పండగ జోష్..: తగ్గుతూనే వస్తోన్న రేట్లు
దేశంలో పండుగల సీజన్ లో బంగారం, వెండి ధరల తగ్గుదల కొనసాగుతూనే వస్తోంది. నేడు మళ్లీ వీటి రేట్లు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కనిపించిన సానుకూల సంకేతాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలను మించడంతో పసిడి, వెండి ధరల్లో ఈ తగ్గుదల నమోదైంది. దీపావళి వేడుకల అనంతరం బులియన్ మార్కెట్‌లో ధరలు మరింత తగ్గడం కొనుగోలుదారుల్లో ఉత్సాహాన్ని నింపినట్టయింది.
సోమవారం నాటి చివరి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 710 రూపాయల మేర తగ్గింది. ఆభరణాల తయారీలో అధికంగా వినియోగించే 22 క్యారెట్లల్లో కూడా రేటు తగ్గింది. 10 గ్రాములకు రూ. 650 వరకు తగ్గుదల కనిపించింది. 18 క్యారెట్లల్లో రూ. 530 ల క్షీణత నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,42,010 వద్దకు చేరుకుంది. పారిశ్రామిక డిమాండ్ నేపథ్యంలో వెండి ధర పెరిగింది. ఇందులో ఏకంగా రూ. 3,570 పెరుగుదల చోటు చేసుకుంది.

గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.34 శాతం పెరిగి 4,045.56 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. స్పాట్ వెండి ఔన్సు 1.69 శాతం లాభపడి 52.378 డాలర్లను తాకింది. అమెరికాలో అక్టోబర్ నెల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 0.4 శాతంగా నమోదైంది. ఇది అంచనా 0.3 శాతం కంటే ఎక్కువ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తెరపైకి రావడంతో పసిడికి సురక్షితమైన పెట్టుబడిగా ఆదరణ పెరిగింది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,790 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,29,974 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,41,560 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,29,763 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,41,970, రూ.1,30,139 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,41,810, 22 క్యారెట్లు రూ. 1,29,993 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,198, 22 క్యారెట్లు - రూ. 13,015, 18 క్యారెట్లు - రూ. 10,650
ముంబై..
24 క్యారెట్లు- రూ. 14,198, 22 క్యారెట్లు - రూ. 13,015, 18 క్యారెట్లు - రూ. 10,649
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 14,198, 22 క్యారెట్లు - రూ. 13,015, 18 క్యారెట్లు - రూ. 10,649
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 14,198, 22 క్యారెట్లు - రూ. 13,015, 18 క్యారెట్లు - రూ. 10,649
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 14,198, 22 క్యారెట్లు - రూ. 13,015, 18 క్యారెట్లు - రూ. 10,649
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 14,198, 22 క్యారెట్లు - రూ. 13,015, 18 క్యారెట్లు - రూ. 10,649













Click it and Unblock the Notifications
