వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో కలిస్తే నాగం పని అంతేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janrdhan Reddy-K Chandrasekhar Rao
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా ఉద్యమిస్తానంటూ తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరింపబడిన నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుతో కలిస్తే ఆయన పని అయిపోయినట్టేనా అంటే అవుననే అంటున్నారు పలువురు రాజకీయ పరిశీలకులు. శనివారం ఈటెల, కెసిఆర్‌తో నాగం భేటీ అయ్యారు. నాగంను పార్టీలోకి ఆహ్వానించే విషయంపై కూడా చర్చలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగం కెసిఆర్‌తో కలిస్తే ఆయనకు ఇంతకు ముందు ఉన్న ప్రాధాన్యత ఉండదని భావిస్తున్నారు. తెలంగాణ అంశాన్ని తన పేటెంట్‌గా భావించి తెలంగాణ కోసం తనకు ఎవరైనా ప్రత్యామ్నాయంగా కనిపిస్తే కెసిఆర్ తన చాతుర్యంతో వారిని డీఇమేజ్ చేస్తాడని పలువురి అభిప్రాయం.

ఈ నేపథ్యంలో నాగం కెసిఆర్‌తో కలిసి పని చేస్తే ఆయన పని అయిపోయినట్లేనని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రాధాన్యత కూడా నాగంకు దక్కక పోవచ్చని భావిస్తున్నారు. పార్టీలో చేరే ముందు లేదా కలిసి పని చేసే ముందు తనతో సమానంగా వారిని చూసి తర్వాత వారిని నెమ్మదిగా డీఇమేజ్ చేస్తాడనే భావన పలువురిలో వ్యక్తం అవుతుంది. అందుకు ఆలె నరేంద్ర మంచి నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు. గతంలో ఆలె నరేంద్ర టిఆర్ఎస్‌లో కెసిఆర్‌తో సమానంగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత కెసిఆర్‌తో పడని ఆయన ఓ కొత్త పార్టీని స్థాపించడం, ఆ తర్వాత కాంగ్రెసులోకి వెళ్లడం జరిగింది. త్వరలో మళ్లీ తన మాతృపార్టీ బిజెపిలోకి వెళ్లనున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెసు పార్టీ నుండి వచ్చిన ఓ మాజీ మంత్రి కూడా ఆ తర్వాత కాంగ్రెసుతో విభేదించి బయటకు వెళ్లి పోయాడు.

పార్టీలోనే కాదు కెసిఆర్ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిని కూడా తన చేతిలోనే ఆరోపణలు గత కొద్దికాలంగా వినిపిస్తోంది. టిడిపి, కాంగ్రెసును ఐక్య కార్యాచరణ సమితి నుండి బయటకు పంపించడమే కాకుండా బిజెపి, సిపిఐ(ఎంఎల్) పాత్రను అందులో పరిమితం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీలు కూడా కెసిఆర్ వైఖరిపై గుర్రుగా ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. కోదండరామ్ కూడా కెసిఆర్ చెప్పినట్లు నడుచుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా తెలంగాణ అంశంపై రాజకీయం తన చుట్టూనే తిరగాలని భావిస్తున్న కెసిఆర్‌తో నాగం వెళితే ఆయన భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో నాగం కొత్త పార్టీ స్థాపించినా లేదా బిజెపిలో చేరినా సముచిత స్థానం ఉంటుందని కానీ టిఆర్ఎస్‌లో చేరితే మాత్రం ఆయన ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్నారు. గతంలో బిజెపి ఆయనను స్వాగతించిన విషయం తెలిసిందే.

English summary
It seems, Nagam Janardhan Reddy will deimaged if he work with TRS president K Chandrasekhar Rao for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X