దీదీ తెలంగాణ ప్లాన్ ఏమిటి?

స్విట్జర్లాండ్‌ను కాంటోన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలుగా విభజించారు. కాంటోన్ అనేది కార్నర్ లేదా డిస్ట్రిక్ట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి పుట్టింది. దాని నుంచే కంటోన్మెంట్ అనే పదం కూడా వచ్చింది. అది ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ జోన్. ప్రాంతాన్ని బట్టి, జనాభాను బట్టి ఇది చాలా చిన్నది. స్విట్జర్లాండ్ మాత్రమే కాకుండా బెల్జియం, బెల్జియం, బొలీవియా, బోస్నియా, కెనడా, కోస్టా రికా, ఇక్విడార్, ఎల్ సాల్విడార్, లెబనాన్, లక్సెంబర్గ్‌ల్లో కూడా కాంటోన్‌లున్నాయి. స్విస్ కాంటోన్స్ ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ ఐరోపా దేశంలోని ప్రతి కాంటోన్ తనదైన రాజ్యాంగాన్ని, చట్టసభను, ప్రభుత్వాన్ని, కోర్టులను కలిగి ఉంటుంది. ఆరోగ్య సేవలు, సంక్షేమం, చట్టాల అమలు, ప్రబుత్వ విద్యలతో పాటు పన్నుల విధానం కూడా కాంటోన్‌ల ఆధీనంలో ఉంటాయి.
గూర్ఖాల్యాండ్‌లో స్థానిక చట్టాలకు, అధికార భాషగా గూర్ఖాకు, ఆర్థిక ప్యాకేజీకి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. గూర్ఖాల్యాండ్ కౌన్సిల్ ఆ ప్రాంతాన్ని పాలిస్తుంది. ప్రజాస్వామబద్దమైన ఎన్నికల ద్వారా ప్రజలు కౌన్సిల్‌ను ఎన్నుకుంటారు. అయితే, దానికి చట్టాలను సవరించే అధికారం ఉండదు. అయితే,తెలంగాణవాదులు ఇటువంటి స్వయంప్రతిపత్తి, ప్యాకేజీలకు అంగీకరించలేదని స్పష్టంగానే చెబుతున్నారు. గత హామీలు, చట్టపరమైన గ్యారంటీలు ఏవీ అమలు కాకపోవడంతో తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేమీ అక్కర్లేదని, రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు. ప్రస్తుత స్థితిని కొనసాగిస్తూ తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి, ఆర్థిక, చట్టపరమైన అధికారాలు ఇవ్వాలని శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరవ సూచన. అయితే, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పునరుద్ధరించిన ప్రాంతీయ మండళ్లు పని చేయడం మానేశాయి. అందువల్ల మమతా బెనర్జీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ఉంటుందనే మాటకు పస లేదని అర్థమవుతోంది.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications