వైయస్ పథకాలకు పేటెంట్ ఎవరిది?

దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులకోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి తాను ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం జాఫర్‌గూడలోని నోవా విద్యాసంస్థలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ విషయం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరుగుతోందని, తాను వెంటనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపిస్తూ వైయస్ జగన్ ఆందోళనకు సిద్ధపడుతున్న సమయంలో డిఎస్ ఆ ప్రకటన చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారని చెప్పాలి.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అవకాశం ఇచ్చారు కాబట్టే వైయస్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని కాంగ్రెసు నాయకులు పదే పదే చెబుతున్నారు. వైయస్ ఉన్నత పదవిని అధిష్టించడానికి సోనియా గాంధీ కారణమైనట్లే, రాష్టంలో కాంగ్రెసు అభ్యర్థులు గెలవడానికి కారణం కూడా ఆమెనే అని చెప్పడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు లేకుండా వైయస్సార్‌కు ప్రత్యేక ఉనికి లేదని చెప్పి వైయస్ జగన్ రాజకీయాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.