అప్పుడు నో, ఇప్పుడు జగన్ కు సై

మైదుకూరు నియోజకవర్గంలో పట్టు సాధించే క్రమంలోనే తెలుగుదేశం పార్టీ రఘురామిరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారంట. పార్టీ ఆశించినట్టుగా ఆయన తీవ్రంగా కృషి చేసి పార్టీకి గట్టి క్యాడర్‌ను సంపాదించి పెట్టాడు. పరిసర గ్రామాల్లోని ప్రజలు రఘురామిరెడ్డి చెప్పినట్టుగా వినేవారంట. గతంలో ఓసారి జగన్ ఓ ఊరికి వచ్చాడంట. వెంటనే రంగంలోకి దిగిన రఘురామిరెడ్డి ఒక్కరు కూడా ఆయనను కలవద్దని సూచించాడంట. ఆయన సూచన మేరకు గ్రామస్తులెవరూ బయటకు రాలేదంట. జగన్ ఊళ్లోకి వచ్చినప్పటికీ ప్రజలెవరూ బయటకు రాలేదు. జగన్ తిరిగి వెళ్లిన అనంతరం వారు మళ్లీ బయటకు వచ్చారు.
మైదుకూరులో తనకు అంతగా పట్టు ఉన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీని అంతగా బలోపేతం చేసిన వ్యక్తి, అంతకు మించి జగన్‌ను తీవ్రంగా అడ్డుకున్న రఘురామిరెడ్డి జగన్ పంచన చేరడం మైదుకూరు నియోజకవర్గం ప్రజలు నమ్మలేక పోతున్నారంట. స్థానిక టిడిపి కూడా దీనిని జీర్ణించుకోలేక పోతుందంట. అయితే ఒకప్పుడు ఊళ్లకు ఊళ్లను తన గుప్పిట్లో ఉంచుకున్న రఘురామిరెడ్డి పార్టీ మారిపోయాక పార్టీ క్యాడర్ ఆయన వెంట వెళ్లేందుకు మాత్రం అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. రఘురామిరెడ్డి పార్టీ మారడాన్ని జిల్లా అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రఘురామిరెడ్డి, జగన్‌కు అమ్ముడు పోయాడని ఆరోపించారు. పెద్ద మొత్తంలో ఆయనకు ఆశ చూపి జగన్ తన పంచన చేర్చుకున్నాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications