వద్దన్నాక బాబు మంతనాలేమిటి?

9వ తేదిన తెలంగాణ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశానికి ముందు అధినేత అనుమతి లేకుండానే నాగం తన ఇంటిలో అదే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అందరు కలిసి చంద్రబాబు ముందు తెలంగాణ టిడిపి ప్రత్యేక శాఖకు పట్టుబట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అవసరమైతే ఒత్తిడి తీసుకు రావడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే బాబు వారిని పిలిచి చీవాట్లు పెట్టడం, తెలంగాణ శాఖపై తన పర్యటన తర్వాత మాట్లాడుతానని చెప్పడం జరిగిపోయింది.
అయితే వారికి చీవాట్లు పెట్టినప్పుడు ప్రత్యేక శాఖ లేదని అవసరమైతే సమన్వయ శాఖ ఏర్పర్చుకొని అందరు కలిసి పోరాడాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయినా నాగం అండ్ కం. ప్రత్యేక శాఖ కోసం బాబు వచ్చిన తర్వాత అడుగుతామని దానికి ఆయనను ఒప్పిస్తామని చెప్పారు. దీంతో ప్రత్యేక శాఖపై ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు మళ్లీ ఆశలు పెంచుకున్నారు. అయితే రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలోనే స్పష్టంగా చెప్పటంతో ప్రత్యేక శాఖ అనేది లేదని తెలిపోయింది. ఇలాంటప్పుడు కేవలం ప్రత్యేక శాఖ కోసమే ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అర్థం లేకుండా పోయింది. ఇప్పటికే శాఖ లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పాక మళ్లీ అదే విషయంపై సమావేశమనేది అర్థరహితమే. అయితే ఈ సమావేశంలో సమన్వయ కమిటీపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications