జగన్‌పై సోనియాకు ఎందుకు ఆగ్రహం కలిగింది?

ఆ తర్వాత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందడం వెంటనే జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని 149 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి అధిష్టానానికి పంపడం అందులో జగన్ పాత్ర ఉందని వార్తలు రావడం సోనియాగాంధీకి మరింత కోపాన్ని తెప్పించాయని సమాచారం. ఆ తర్వాత జగన్ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా భారీగా ఓదార్పు యాత్రను చేపట్టడం తదితర అంశాలు సోనియాకు మనస్థాపం కలిగించాయని తెలుస్తోంది. సాక్ష్యాత్తూ తన కుమారుడు రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయాలలో రాటు దేలే వరకు ఆ విషయాన్ని పక్కన పెట్టింది. అలాంటిది జగన్ మాత్రం తన తండ్రి మరణించగానే ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు చేయడం ఆమెలో ఆగ్రహాన్ని కలిగించాయని తెలుస్తోంది. అయితే కర్ణాటకలో బిజెపి ఎమ్మెల్యేలను గెలిపించడానికి ప్రయత్నాలు చేయడమే ఆమెను మొదటిసారి ఆగ్రహానికి గురి చేశాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications