ప్రధానితో భేటీ వార్తలపై ఇరకాటంలో పడిన జగన్

ప్రధాని ఎదురొచ్చి వైయస్ జగన్‌ను ఆహ్వానించారని మేకపాటి రాజమోహన్ రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో ఓ సభలో అన్నారు. జాతీయ నాయకుల నుంచి జగన్‌కు సాదర ఆహ్వానం లభించిందని, తాను దగ్గరుండి చూశానని ఆయన చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తలువు వద్దకు వచ్చి మరీ జగన్‌ను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. ప్రధాని జగన్‌తో అర నిమిషం మాత్రమే మాట్లాడారని వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. ప్రధాని జగన్‌తో 11 నిమిషాలు మాట్లాడారని ఆయన చెప్పారు.
ఢిల్లీ యాత్రపై వచ్చిన వార్తలతో వైయస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారు. బిజెపి నేత సుష్మా స్వరాజ్ జగన్‌కు బిజీగా ఉన్నానంటూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కేంద్ర మంత్రులు శరద్ పవార్‌ను జగన్ వ్యవసాయం పేరు చెప్పి కలిశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన కలిశారు. అయితే, జగన్‌కు అంత మద్దతు లభించలేదనే చెప్పాలి. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న మీడియా దాంతో పండుగ చేసుకుంది. దాని వల్ల జరిగిన నష్టాన్ని నివారించడంపై వైయస్ జగన్ వర్గం ఇప్పుడు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. మీడియా వార్తలపై వైయస్ జగన్ ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications