వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో టెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ త్వరలో వస్తుంది, ప్రజల కోసం, వైయస్ ఆశయసాధన కోసం కృషి చేసే జగన్ పార్టీ త్వరలో రానుందని ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యులు బహిరంగ సభల్లో, మీడియా ప్రతినిధుల ఎదుట ధాటిగా మాట్లాడుతున్నప్పటికీ అంతరంగంగా మాత్రం వారిని ఓ బాధ వెన్నాడుతోంది. అదే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ప్రస్తుతానికి జగన్ పార్టీ పెట్టలేదు కాబట్టి ఆయన వెంట వెళ్లినా ఎలాంటి సమస్య ఉండదు. ఏ పార్టీ వారిపై చర్యలు తీసుకునే ఆస్కారం లేదు. కానీ మరో పది పదిహేను రోజుల్లోనే వైయస్ జగన్ పార్టీ పెట్టనున్నారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత మాత్రం ఆయన వెంట వెళితే ఆయా పార్టీలు ఆయా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. ప్రస్తుతం వారి మదిలో అదే భయం మెదులుతోంది.

అవసరమైన సమయంలో జగన్ వెంట నడవడానికి కాంగ్రెసు పార్టీలో సగం మంది ఉన్నారని చెప్పినప్పటికీ ఫీజు పోరులో ఇరవై మూడుకి మించలేదు. పార్టీ పెట్టాక కూడా వారిలో ఎంత మంది ఉంటారో, ఎంత మంది వెళతారో తెలియదు. పిల్లి సుభాష్ చంద్రబోస్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కమలమ్మ తదితరుల నేతలు జగన్ వెంట వెళ్లడానికి రాజీనామాలకు దేనికైనా సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన వర్గంలోని మరికొందరు మాత్రం రాజీనామాలపై, పార్టీ ఫిరాయింపుల చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు కనపడటం లేదు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పోటీ చేస్తే మళ్లీ గెలుస్తామో లేదో అనే సందేహంతో తెలంగాణలో ఆయన వెంట వెళుతున్న వారు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న ఇద్దరు సిఎం కిరణ్‌కుమార్ రెడ్డితో గతంలో మంతనాలు చేసినప్పటికీ దారికి రాలేదు. అయితే వారు జగన్ పార్టీ పెట్టాక పార్టీ ఫిరాయింపుల చట్టానికి భయపడైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఇక జగన్ వర్గం అతిముఖ్యమైన నేత కొండా సురేఖ ఇటీవల పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, ముఖ్యమంత్రితో భేటీ కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మాటల్లో కూడా గతంలో కంటే పదును తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక సీమాంధ్రలో సైతం జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల చట్టం భయపెడుతోంది. కాంగ్రెసు, టిడిపి వారు జగన్ పార్టీ పెట్టాక కూడా ఆయన వెంట సీమాంధ్ర ఎమ్మెల్యేలు వెళితే ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటారు. కాంగ్రెసు పార్టీ రెండుగా విడిపోయినందున, టిడిపి వారికి వ్యక్తిగతంగా వారి వారి నియోజకవర్గాల్లో పెద్దగా వ్యక్తిగత ప్రతిష్ట లేదన్న నేపథ్యంలో మళ్లీ గెలిచే అవకాశాలు చూసుకునే జగన్ వెంట నడిచేందుకు సిద్ధ పడతారు. అయితే పీఆర్పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలకు మాత్రం చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెసు‌లో విలీనం చేస్తానని ప్రకటించడం వారికి ఆనందం కలిగించే విషయం. చిరు కాంగ్రెసు‌లో చేరితే వారు చిరు వెంట వెళ్లాల్సిన అవసరం లేదు, స్వతంత్ర సభ్యులుగా అవుతారు. అయితే పార్టీ ఇంకా అధికారికంగా విలీనం చేయనందున వారి భవితవ్యం ముందు ముందు తేలనుంది.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp MLAs are in tension regarding the strategy to be adapted after his party announcement. Some are from Congress, Two from TDP and Two from PRP. If they will went with Jagan after party announcement Mother party will demand to take action on them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X