కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు చెమటలు పట్టిస్తున్న వివేకా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి అబ్బాయ్ వైయస్ జగన్‌కు చెమటలు పట్టిస్తున్నారు. వైయస్ జగన్ రాజకీయ దూకుడుకు కళ్లెం వేసే ఉద్దేశంతో వైయస్ వివేకానంద రెడ్డి కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వర్గానికి చెందిన అభ్యర్థి నారాయణ రెడ్డిని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కడపలోనే మకాం వేసి ఎంపిటీసీలు, జడ్‌పిటిఎస్‌లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రిగా శాసనసభ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. తన వ్యవసాయ శాఖ విషయాలను మరో మంత్రికి అప్పగించి ఆయన కాంగ్రెసు అభ్యర్థి వరదరాజుల రెడ్డి విజయానికి కృషి చేస్తున్నారు.

కడప జిల్లాలో మొత్తం 622 మంది ఎంపిటిసీ, జడ్పీటిసీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెసుకు 498 మంది, తెలుగుదేశం పార్టీకి 122 మంది ఉన్నారు. తమ అభ్యర్థికి కనీసం 270 ఓట్లు వస్తాయని జగన్ వర్గం విశ్వసిస్తోంది. గెలుపు కోసం వైయస్ జగన్ వర్గం కూడా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ స్థితిలోనే ఎంపిటీసలు, జడ్పీటిసీల కిడ్నాప్ వివాదాలు ముందుకు వచ్చాయి. అయితే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ ఓట్లను కూడా తమ వైపు తిప్పుకునేందుకు వైయస్ వివేకానంద రెడ్డి పావులు కదిపారు. వివేకానంద రెడ్డితో పాటు మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ వర్గం అభ్యర్థిని ఓడించేందుకు వ్యూహరచన చేసి అమలు చేస్తున్నారు.

కాంగ్రెసు అభ్యర్థిని గెలిపిస్తేనే వైయస్సార్ పథకాలు సక్రమంగా అమలవుతాయని వైయస్ వివేకానంద రెడ్డి నచ్చజెబుతున్నారు. కడప జిల్లాలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అయితే, వివేకానంద రెడ్డిని ఎదుర్కోవడానికి వైయస్ జగన్ వర్గం కూడా తీవ్రంగానే కృషి చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం పులివెందుల శాసనసభకు, కడప పార్లమెంటుకు జరిగే ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. జగన్ వర్గం అభ్యర్థిని ఓడిస్తే ఆ ఎన్నికల్లో వైయస్ జగన్‌పై నైతిక విజయం సాధించినట్లు కూడా అవుతుందని కూడా భావిస్తున్నారు.

English summary
Minister YS Vivekananda Reddy is putting efforts to defeat YS Jagan camp candidate in Kadapa district MLC election. He is meeting with ZPTC and MPTC members to get support to Congress candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X